News August 26, 2024

వాలంటీర్లు, అంగన్‌వాడీల సమస్యలపై వైసీపీ పోరుబాట?

image

AP: ఎన్నికల్లో కూటమి నేతలు వాలంటీర్లు, అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో వైసీపీ పోరుబాట పట్టనున్నట్లు సమాచారం. 2 నెలలుగా జీతాలు రాకపోవడం, తమ సేవలను ఉపయోగించుకోకపోవడంతో వాలంటీర్లు ఆందోళనలో ఉన్నారు. అలాగే జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. వీరు త్వరలో ఆందోళనలు చేయాలని నిర్ణయించుకోవడంతో మద్దతు పలకాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Similar News

News September 15, 2024

భారత దిగ్గజాలు ఇండియాను పాక్‌‌కు పంపండి.. ప్లీజ్: మోయిన్

image

పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్‌ను పంపేలా క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్, ద్రవిడ్, గంగూలీ బీసీసీఐతో మాట్లాడాలని పాక్ మాజీ క్రికెటర్ మోయిన్ ఖాన్ విజ్ఞప్తి చేశారు. ‘క్రికెట్ ఆగకూడదు. ఇరు దేశాలు ఆడటమనేది పాక్‌తో పాటు మొత్తం క్రికెట్‌కు మంచిది. ఇండియా రాకపోతే పాక్ కూడా భారత్‌లో పర్యటించకూడదు’ అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

News September 15, 2024

రెండు రోజులు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్

image

AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈనెల 17న మధ్యాహ్నం వరకు ఆయనను పోలీసులు మంగళగిరి రూరల్ పీఎస్‌లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా దూషించడం, భయపెట్టడం, లాఠీ ఛార్జ్ వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

News September 15, 2024

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

image

TG: PMFBY కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంటల బీమాను అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లను స్వీకరించనుంది. బీమా ప్రీమియంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం రూ.2,500కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజేయనున్నట్లు సమాచారం. అయితే ఏ సీజన్ (ఖరీఫ్ORరబీ) నుంచి అమలు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.