News August 28, 2024
అల్లు అర్జున్‌కు వైసీపీ సపోర్ట్!
అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా అభిమానుల వార్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం, ఇష్టమైన వాళ్ల దగ్గరికే వెళ్తానని చెప్పడం దుమారం రేపుతున్నాయి. తాజాగా బన్నీకి YCP ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. అల్లు రామలింగయ్య లేకపోతే మెగా ఫ్యామిలీ ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు పవన్ మద్దతు ఇచ్చినట్లుగానే బన్నీ తన స్నేహితుడికి సపోర్ట్ చేశారని పోస్టులు పెడుతున్నారు.
Similar News
News September 15, 2024
రెండు రోజులు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్
AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈనెల 17న మధ్యాహ్నం వరకు ఆయనను పోలీసులు మంగళగిరి రూరల్ పీఎస్‌లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా దూషించడం, భయపెట్టడం, లాఠీ ఛార్జ్ వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
News September 15, 2024
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్
TG: PMFBY కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంటల బీమాను అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లను స్వీకరించనుంది. బీమా ప్రీమియంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం రూ.2,500కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజేయనున్నట్లు సమాచారం. అయితే ఏ సీజన్ (ఖరీఫ్ORరబీ) నుంచి అమలు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.
News September 15, 2024
మా ఆర్థిక కష్టాలు తాత్కాలికమే: మాల్దీవులు
తమ ఆర్థిక కష్టాలు తాత్కాలికమేనని మాల్దీవుల ఆర్థిక మంత్రి మూసా జమీర్ తాజాగా పేర్కొన్నారు. చైనాకు దగ్గరయ్యాక ఆ దేశం అప్పుల ఊబిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్యాకేజీకి మాల్దీవులు యత్నిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే మిత్రదేశాలు తమకున్నాయని, IMF గురించి ఆలోచించడం లేదని మూసా స్పష్టం చేశారు.