News December 27, 2024
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట
AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.
Similar News
News December 27, 2024
2025లో గ్రహణాలు ఎప్పుడంటే!
రానున్న ఏడాదిలో 2 సూర్య, 2 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడుతుంది. ఇది మన దేశంలో కనిపించదు. US, వెస్ట్రన్ యూరప్, ఆఫ్రికాలో దర్శనమిస్తుంది. మార్చి 29న ఏర్పడే పాక్షిక సూర్య గ్రహణం కూడా స్వదేశంలో కనిపించదు. Sep 7-8 మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం మాత్రమే భారత్‌లో కనిపిస్తుంది. Sep 21న పాక్షిక సూర్యగ్రహణాన్ని కూడా మనం చూసే అవకాశం ఉండదు.
News December 27, 2024
మన్మోహన్ స్మారకార్థం ప్రత్యేక స్థలం కోరిన కాంగ్రెస్
మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం ఢిల్లీలోని యమునా నద్ది ఒడ్డున ప్రత్యేక స్మృతి స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి ఖర్గే తీసుకెళ్లారు. రాజ్‌నాథ్ సింగ్‌తోనూ కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. అయితే, స్థలం కొరత దృష్ట్యా జాతీయ స్థాయి నేతలకు రాజ్ ఘాట్‌లో ఉమ్మడి స్మారక స్థలం- రాష్ట్రీయ స్మృతి స్థల్ ఏర్పాటుకు 2013లోనే UPA నిర్ణయించడం గమనార్హం.
News December 27, 2024
కుంభమేళాకు 16 ప్రత్యేక రైళ్లు
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ తదితర ప్రాంతాల్లో జనవరి, ఫిబ్రవరిలో జరిగే మహా కుంభమేళాను పురస్కరించుకుని SCR 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, మౌలాలి, కాచిగూడ నుంచి వివిధ తేదీల్లో బయల్దేరే ఈ రైళ్లు గయ, పాట్నా, అజంగఢ్ వరకు ప్రయాణిస్తాయి. రైళ్లు ప్రయాణించే తేదీలు, హాల్టింగ్‌ల వివరాలను పైనున్న ఫొటోల్లో చూడవచ్చు.