News December 27, 2024
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నేడు వైసీపీ పోరుబాట
AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వైసీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారు. కరెంట్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తారు. ప్రజలపై రూ.15,485 కోట్ల భారాన్ని ప్రభుత్వం మోపిందని వైసీపీ ఆరోపిస్తోంది.
Similar News
News January 24, 2025
మొన్న చిలుకూరులో.. నేడు దోమకొండలో ప్రియాంక పూజలు
TG: హీరోయిన్ ప్రియాంకా చోప్రా కామారెడ్డి(D) దోమకొండ గడికోట మహాదేవుడి ఆలయంలో పూజలు చేశారు. హీరో రామ్‌చరణ్ మామ వంశస్థులకు చెందినదే ఈ దోమకొండ గడికోట. ‘జంజీర్’ మూవీ సమయంలో గడికోట గురించి ప్రియాంకకు చెర్రీ, ఉపాసన చెప్పడంతో తాజాగా ఆమె అక్కడికి వెళ్లారు. ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయాన్నీ ప్రియాంక దర్శించుకున్నారు. రాజమౌళి-మహేశ్ సినిమాలో నటించేందుకు ఆమె HYD వచ్చినట్లు తెలుస్తోంది.
News January 24, 2025
ఎల్లుండి రవితేజ ‘మాస్ జాతర’ గ్లింప్స్ విడుదల
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా భాను బోగవరపు తెరకెక్కిస్తోన్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. రవితేజ బర్త్ డే సందర్భంగా ఈనెల 26న చిత్ర గ్లింప్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘రవన్న మాస్ దావత్ షురూ రా భయ్’ అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు.
News January 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. కీలక ఆధారాలు లభ్యం
హైదరాబాద్ మీర్‌పేట్‌లో భార్యను కిరాతకంగా నరికి <<15241806>>ముక్కలు ఉడికించిన <<>>కేసులో పోలీసులు కీలక ఆధారాలు గుర్తించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను సేకరించారు. వాటి DNA శాంపిల్స్ తీసుకున్న పోలీసులు పిల్లల DNAతో టెస్ట్ చేయనున్నారు. భార్య మాధవి హత్యకు గురుమూర్తి ఉపయోగించిన పలు వస్తువులను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో శుభ్రం చేసిన రక్తపు మరకలను ఇన్‌ఫ్రారెడ్ ద్వారా గుర్తించారు.