News August 7, 2024
ఎల్లో అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

TG: రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఇక నిన్న ఖమ్మం గుబ్బగుర్తిలో అత్యధికంగా 14.8cm వర్షపాతం నమోదైంది. తల్లాడలో 11.8, రఘునాథపాలెంలో 10.7 సెం.మీ.ల వర్షం కురిసింది.
Similar News
News November 18, 2025
CNG సరఫరా నిలిచి ముంబైలో స్తంభించిన రవాణా

ముంబైలో 2 రోజులుగా CNG సరఫరా నిలిచి ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో ఆదివారం నుంచి గ్యాస్ సరఫరా నిలిచింది. CNGతో నడిచే ఆటోలు, కార్లు, బస్సులు తిరగక అవస్థలు తప్పలేదు. సోమవారం నాటికి కొంతమేర సరఫరా చేపట్టారు. నేటి మధ్యాహ్నానికి కానీ పూర్తి సరఫరా కాదని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ముంబైలో CNGతో నడిచే కార్లే 5 లక్షల వరకు ఉన్నాయి.

మావోలకు మరో 4 నెలలే గడువు: బండి

TG: అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. హిడ్మా హతం సందర్భంగా ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని, మరో 4 నెలలే ఉన్నందున నక్సల్స్ లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బుల్లెట్ను కాకుండా బ్యాలెట్ను నమ్ముకోవాలని సూచించారు. కేవలం పోలీసులు, సైనికుల చేతుల్లోనే తుపాకులు ఉండాలన్నారు.