News August 7, 2024
ఎల్లో అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

TG: రాష్ట్రంలో ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఇక నిన్న ఖమ్మం గుబ్బగుర్తిలో అత్యధికంగా 14.8cm వర్షపాతం నమోదైంది. తల్లాడలో 11.8, రఘునాథపాలెంలో 10.7 సెం.మీ.ల వర్షం కురిసింది.
Similar News
News July 9, 2025
ఆధార్ తొలి గుర్తింపు కాదు: భువనేశ్

బిహార్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నకిలీ ఓట్లను గుర్తించేందుకు ఆధార్‌ను అనుసంధానించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాగా ఆధార్ కేవలం ఒక ధ్రువీకరణ మాత్రమేనని, అర్హతకు ప్రాథమిక ఆధారం లేదా గుర్తింపు కాదని UIDAI CEO భువనేశ్ కుమార్ స్పష్టం చేశారు. అటు ఫేక్ ఆధార్ కార్డుల కట్టడికీ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నకిలీ ఆధార్‌లను గుర్తించే QR కోడ్ స్కానర్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందన్నారు.
News July 9, 2025
సామ్‌తో రాజ్.. శ్యామలి ఇంట్రెస్టింగ్ పోస్ట్

హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్ల వేళ వీరిద్దరూ కలిసి ఉన్న <<17000941>>ఫొటో<<>> వైరలైన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాజ్ సతీమణి శ్యామలి ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘ఏ మతమైనా మన చర్యలతో ఇతరులను బాధించొద్దని చెబుతుంది. అదే మనం పాటించాల్సిన గొప్ప నియమం’ అని రాసున్న కొటేషన్‌ను ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది.
News July 9, 2025
షాకింగ్.. పిల్లలకు లెక్కలు రావట్లేదు!

దేశంలోని స్కూళ్లలో విద్యార్థుల్లో ఎక్కువ మందికి లెక్కలు(గణితం) రావట్లేదని కేంద్రం సర్వేలో తేలింది. మూడో తరగతి పిల్లల్లో 45% మంది ఆరోహణ, అవరోహణ క్రమాన్ని గుర్తించలేకపోతున్నారని పేర్కొంది. ఆరో తరగతిలో 10 వరకు ఎక్కాలు(టేబుల్స్) వచ్చిన వారు 53% శాతమే. తొమ్మిదిలో గణితంపై అవగాహన ఉన్నవారు ఇంతే శాతమని తెలిపింది. దీని ప్రకారం విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.