News October 3, 2024

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Similar News

News December 1, 2025

ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాను: MP

image

రామగుండం నియోజకవర్గంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ ప్రకటనలో తెలిపారు. ఈ విషయంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడును సోమవారం ఢిల్లీలో కలిసి మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈనెల 3, 4 తేదీలలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం రామగుండం ప్రాంతాన్ని సందర్శించి, కొత్త ల్యాండ్ సర్వే చేస్తుందన్నారు. భూసేకరణ, తుది నిర్ణయాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

News December 1, 2025

TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.

News December 1, 2025

డేటింగ్ వార్తలపై మృణాల్ క్లారిటీ

image

హీరో ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ <<18371019>>డేటింగ్<<>> వార్తలు కొన్ని నెలలుగా వస్తున్నాయి. తాజాగా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు SMలో ప్రచారం జరుగుతోంది. వీటిపై మృణాల్ పరోక్షంగా స్పందించారు. ‘ఇలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తుంది. రూమర్ల వల్ల ఉచితంగా నాకు PR జరుగుతోంది. ఇలాంటి ఫ్రీ స్టఫ్ నాకు ఇష్టం’ అని చెప్పారు. తాము మిత్రులమంటూ ధనుష్‌తో డేటింగ్ వార్తలను గతంలో ఆమె కొట్టిపారేశారు.