News October 3, 2024
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
TG: రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Similar News
News November 14, 2024
సచివాలయ ఉద్యోగులకు అలర్ట్
AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.
News November 14, 2024
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు
AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కనుమూరు రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు. కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి RRR తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
News November 14, 2024
సీనరేజ్ మినహాయిస్తూ AP సర్కార్ నిర్ణయం
AP: అమరావతి చుట్టూ ORR, విజయవాడ ఈస్ట్ బైపాస్‌లకు చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్ మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.6వేల కోట్లకు పైగా ఖర్చయ్యే 189కి.మీ ORR, 50కి.మీ. బైపాస్ కోసం భూసేకరణను NHAI, MORTH భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్నికోరింది. దానికి ప్రత్యామ్నాయంగా పై నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ 2నిర్మాణాల కోసం స్టీల్, సిమెంట్, తదితరాలకు రాష్ట్ర GST మినహాయింపునకు ముందుకొచ్చింది.