News October 30, 2024

అవును.. అమిత్‌ షానే ఖలిస్థానీలపై కుట్రచేశారు: కెనడా

image

తమ దేశంలో ఖలిస్థానీలను చంపేందుకు కుట్రలు పన్నింది అమిత్ షా‌నే అని కెనడా తాజాగా ఆరోపించింది. కుట్రలు పన్నింది ఆయనేనా అని వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ‘అవును’ అని జవాబిచ్చినట్టు కెనడా డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మోరిస్ పార్లమెంటరీ ప్యానెల్‌కు చెప్పారు. దీనిపై ఎలాంటి వివరాలు, ఆధారాలను మాత్రం ఆయన ఇవ్వలేదు. ఆయన స్టేట్‌మెంట్‌పై భారత హైకమిషన్, విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.

Similar News

News November 15, 2025

మోరెల్ పుట్టగొడుగులు పెరిగే పరిస్థితులు ప్రత్యేకం

image

ఈ పుట్టగొడుగులు సముద్రమట్టానికి 2,000-3,500 మీటర్ల ఎత్తులో ఆకురాల్చే చెట్ల కింద సారవంతమైన, కుళ్లిపోతున్న దుంగలు, నదీ ఒడ్డు ప్రాంతాలలో కనిపిస్తాయి. ఇవి తేనెగూడు లాంటి టోపీ, బోలు నిర్మాణం కలిగి, లేత బంగారు గోధుమ రంగులో.. 5 నుంచి 20 సెం.మీ ఎత్తు వరకు జనవరి- జూన్ మధ్య పెరుగుతాయి. మార్చి-మే మధ్య వీటి లభ్యత ఎక్కువ. వీటిని కృత్రిమంగా సాగు చేయలేం. మంచు, మెరుపులతో కూడిన వర్షాల వేళ ఇవి ఎక్కువగా పెరుగుతాయి.

News November 15, 2025

ఇతిహాసాలు క్విజ్ – 67

image

ఈరోజు ప్రశ్న: శ్రీమహావిష్ణువుపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది. వైకుంఠాన్ని వీడి, భూమ్మీదకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 15, 2025

మోరెల్ పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు

image

మోరెల్ పుట్టగొడుగుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, కాపర్, విటమిన్ బి-2, యాంటీఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వీటిలో ఎక్కువ. అందుకే ఈ పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి, క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులు, గుండె జబ్బులు, మధుమేహం ముప్పు చాలా వరకు తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.