News December 27, 2024
అవును.. ఆయన బలహీన ప్రధాని కాదు
తాను బలహీన ప్రధానినంటూ BJP చేసిన విమర్శలకు 2014లో మన్మోహన్ కౌంటరిచ్చారు. ‘నేను వీక్ PM కానేకాదు. పరిస్థితులకు అనుగుణంగా బాగానే పనిచేశా. సమకాలీన మీడియా కంటే చరిత్ర నన్ను దయతో గుర్తుపెట్టుకుంటుంది’ అని పేర్కొన్నారు. RTI, ఉపాధి హామీ, USతో న్యూక్లియర్ డీల్, విద్యాహక్కు చట్టం, జాతీయ ఆహారభద్రతా చట్టం, నేషనల్ హెల్త్ మిషన్, అధిక GDP, పటిష్ఠ విదేశాంగ విధానాలతో ఆయన బలహీన ప్రధాని కాదని నిరూపించుకున్నారు.
Similar News
News January 22, 2025
నేడు అనంతలో ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్
AP: సినీ నటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభ నేడు అనంతపురంలో నిర్వహించనున్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో సాయంత్రం 6.30 గంటలకు జరగనున్న ఈ సభకు హీరో బాలకృష్ణతో పాటు చిత్ర యూనిట్ హాజరు కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతలో నిర్వహించాలని అనుకున్నా.. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రద్దు చేశారు. ‘డాకు మహారాజ్’ ఈ నెల 12న రిలీజైన విషయం తెలిసిందే.
News January 22, 2025
ఇవాళ్టి నుంచి JEE మెయిన్ పరీక్షలు
దేశంలోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE మెయిన్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేశంలో 12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానుండగా, తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 22, 23, 24 తేదీలతో పాటు 28, 29 తేదీల్లో 2 సెషన్ల(ఉ.9-12, మ.3-6)లో పరీక్షలు జరగనున్నాయి. 30న బీఆర్క్, బీ ప్లానింగ్ పరీక్ష నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
News January 22, 2025
ALERT.. ఇవాళ, రేపు జాగ్రత్త
తెలంగాణను చలి వణికిస్తోంది. ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తూ, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.