News November 27, 2024

అవును.. నేనో కామన్ మ్యాన్: ఏక్‌నాథ్ శిండే

image

తాను ప్రజా సేవకుడినని, ఎప్పుడూ సీఎంగా భావించలేదని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే అన్నారు. ‘CM అంటే కామన్ మ్యాన్. నేనిలాగే ఫీలవుతా. మేమెప్పుడూ ప్రజల కోసమే పనిచేస్తాం. ప్రజలు ఇంటినెలా నెట్టుకొస్తున్నారో, వారి బాధలేంటో చూశాను. అందుకే లడ్కీ బహన్ స్కీమ్ తీసుకొచ్చాను. PM మోదీ ఎంతో సాయం చేశారు. మా ఇద్దరి విజన్ ఒక్కటే. MVAలో ఆగిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను మేం పూర్తిచేశాం’ అని అన్నారు.

Similar News

News December 3, 2024

ఆ విషయంలో ‘గేమ్ ఛేంజర్’ రికార్డు

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా 2025 జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో అమెరికాలోని డల్లాస్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరగనుంది. తాజాగా వేదిక వివరాలను మేకర్స్ వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 6 గంటలకు Curtis Culwell Cente, గార్లాండ్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఓ ఇండియన్ సినిమా USAలో ప్రీరిలీజ్ అవ్వడం ఇదే తొలిసారని మేకర్స్ వెల్లడించారు.

News December 3, 2024

7 IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్.. విలువ రూ.12,000 కోట్లు

image

మరో ఏడు కంపెనీల IPOలకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఈకామ్, స్మార్ట్‌వర్క్ కోవర్కింగ్ స్పేసెస్, ట్రూఆల్ట్, జెమాలాజికల్, కెరారో, కాంకర్డ్, వెంటివ్ హాస్పిటాలిటీ ఉన్నాయి. IPOల ద్వారా సంస్థలు దాదాపు రూ.12,000 కోట్లు సమీకరించనున్నాయి. జెమాలాజికల్ అత్యధికంగా రూ.4వేల కోట్లు సమీకరించనుంది. మరోవైపు 2025లో జెప్టో పబ్లిక్ ఇష్యూకు వీలున్నట్లు కంపెనీ కో ఫౌండర్ ఆదిత్ పాలిచా వెల్లడించారు.

News December 3, 2024

పాగల్ ‘ఫెంగల్’.. 1,500kmల ప్రభావం

image

ఫెంగల్ తుఫాను భిన్న రూపాల్లో ముప్పుతిప్పలు పెట్టింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి ఓసారి బలహీనపడుతూ, కొన్ని గంటలకే బలపడుతూ పుదుచ్చేరి వద్ద తీరం దాటింది. దాని ప్రభావం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి మీద మాత్రమే కాకుండా 1,500km దూరంలోని ఒడిశాపైనా చూపింది. 5 రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీని తీవ్రత ఇవాళ సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతుందని IMD వెల్లడించింది.