News September 5, 2024

అవును.. ఇది మందుల చీటీనే

image

మధ్యప్రదేశ్‌ సత్నా జిల్లాలోని నాగౌడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ డాక్ట‌ర్ రాసిన మందు చీటీ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. అక్క‌డి డాక్టర్ అమిత్ సోనీ ఓ రోగికి రాసిన ప్రిస్క్రిప్ష‌న్‌ని ఆస్ప‌త్రిలోని ఔష‌ద కేంద్రంలోగానీ, ప్రైవేటు మెడిక‌ల్ షాపులోగానీ ఎవ‌రూ అర్థం తీసుకోలేకపోతున్నారు. ఈ చేతిరాత అర్థంకాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ చీటీ వైరల్ అవ్వడంతో ఆ వైద్యుడికి జిల్లా వైధ్యాధికారి నోటీసులు జారీ చేశారు.

Similar News

News September 20, 2024

Learning English: Synonyms

image

✒ Gross: Improper, Rude, Coarse
✒ Happy: Pleased, Contented
✒ Hate: Despise, Loathe, Abhor
✒ Have: Acquire, Gain, Maintain
✒ Help: Aid, Assist, Succor
✒ Hide: Conceal, Shroud, Veil
✒ Hurry: Hasten, Urge, Accelerate
✒ Hurt: Distress, Afflict, Pain
✒ Idea: Thought, Concept, Notion

News September 20, 2024

బీజేపీ ఎంపీ రఘునందన్‌పై హైకోర్టు ఆగ్రహం

image

TG: మెదక్ BJP MP రఘునందన్‌రావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చిన స్టేకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారని ఓ న్యాయమూర్తి సీజేకు లేఖ రాశారు. ఆయన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. ఈ లేఖను సుమోటోగా తీసుకున్న ధర్మాసనం రఘునందన్‌కు నోటీసులు ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశించింది.

News September 20, 2024

మాతృత్వంతో ఆనందం, ఆందోళన: అలియా భట్

image

తల్లి అయిన తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్ సాధ్యం కావట్లేదని హీరోయిన్ అలియా భట్ చెప్పారు. తనకంటూ సమయం వెచ్చించలేకపోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మాతృత్వం ఆనందంగానే ఉన్నా ఆందోళన కూడా ఉందన్నారు. కూతురు రాహా అల్లరి, చిలిపి పిల్ల అని మురిసిపోయారు. 2022 నవంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన అలియా ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమాతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 11న ఇది విడుదల కానుంది.