News June 21, 2024
యోగా.. కోట్లమందికి దైనందిన కార్యక్రమం: మోదీ

విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని PM మోదీ అన్నారు. యోగా డే సందర్భంగా ఆయన శ్రీనగర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. దీన్ని నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని, ఓ మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని గుర్తుచేశారు. యోగా ఇవాళ కోట్లమందికి దైనందిన కార్యక్రమం అయిందని వెల్లడించారు.
Similar News
News January 9, 2026
పుట్టుకతో కుబేర యోగం ఎలా కలుగుతుంది?

జాతక చక్రంలో ధన స్థానమైన 2వ ఇల్లు, లాభ స్థానమైన 11వ ఇల్లు చాలా కీలకం. ఈ 2 స్థానాల అధిపతులు తమ స్వక్షేత్రాల్లో లేదా ఉచ్ఛ స్థితిలో ఉండి, ఒకరినొకరు వీక్షించుకున్నా లేదా కలిసి ఉన్నా కుబేర యోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా గురు, శుక్ర గ్రహాల అనుకూలత ఈ యోగానికి బలాన్ని ఇస్తుంది. లగ్నాధిపతి బలంగా ఉండి ఎనిమిది, పన్నెండో స్థానాలతో శుభ సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఈ యోగం ఏర్పడి వ్యక్తిని ధనవంతుడిని చేస్తుంది.
News January 9, 2026
ALERT: ఆ పత్తి విత్తనాలు కొనొద్దు

TG: కేంద్రం అనుమతి లేని HT(Herbicide tolerant) పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ పత్తి రకాన్ని అమెరికాకు చెందిన మోన్సాంటో కంపెనీ అభివృద్ధి చేసింది. అయితే ఫీల్డ్ ట్రయల్స్లో ఇవి విఫలమవ్వడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని ఈ విత్తనాల వినియోగానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. రైతులు వీటిని కొని ఇబ్బందిపడొద్దని మంత్రి సూచించారు.
News January 9, 2026
నేటి నుంచి WPL.. MI, RCB మధ్య తొలి మ్యాచ్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2026) నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో ఛాంపియన్ టీమ్స్ ముంబై, బెంగళూరు తలపడనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో 7.30PMకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. MIకి హర్మన్ ప్రీత్, RCBకి స్మృతి మంధాన కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు 3 సీజన్లు జరగగా MI రెండు సార్లు (2023, 25), RCB (2024) ఒకసారి టైటిల్ గెలిచాయి. హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లో లైవ్ చూడవచ్చు.


