News June 21, 2024

యోగా.. కోట్లమందికి దైనందిన కార్యక్రమం: మోదీ

image

విదేశాల్లో యోగా చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని PM మోదీ అన్నారు. యోగా డే సందర్భంగా ఆయన శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. దీన్ని నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని, ఓ మహిళకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందని గుర్తుచేశారు. యోగా ఇవాళ కోట్లమందికి దైనందిన కార్యక్రమం అయిందని వెల్లడించారు.

Similar News

News September 18, 2024

మీ నోటికి తాళం వేసుకోండి చంద్రబాబు: అంబటి రాంబాబు

image

AP: రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే నోటికి తాళం వేస్తానన్న సీఎం చంద్రబాబు హెచ్చరికపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి తాళాలు వేస్తారు? అక్రమంగా ఉన్న మీ ఇంటికి ముందు తాళం వేయండి. అప్పటి వరకు మీ నోటికి తాళం వేసుకోండి’ అని ట్వీట్ చేశారు.

News September 18, 2024

నెల్లూరులో జానీ మాస్టర్!

image

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై నెల్లూరు పోలీసులను నార్సింగి పోలీసులు సంప్రదించారని సమాచారం. దీంతో జానీ మాస్టర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశముంది.

News September 18, 2024

రాహుల్‌పై వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు

image

TG: మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందన్న బీజేపీ నేత తన్వీందర్ సింగ్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు దిగింది. ధర్నాలు చేపట్టడంతో పాటు బీజేపీ నేతల దిష్టిబొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హన్మకొండలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో ఆయన మధ్యాహ్నం పాల్గొంటారు.