News May 13, 2024
మీరు సూపర్ తాత!.. 106ఏళ్ల వయసులో ఓటు
బిహార్‌లో 106ఏళ్ల రామ్ నాథ్ సింగ్ అనే ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెగుసారాయి పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఖమ్హార్‌లో ఉన్న 144వ పోలింగ్ బూత్‌కు వచ్చిన ఓటు వేశారు. ఇదిలా ఉంటే మన హైదరాబాద్‌లోని పాతబస్తీ ఓటర్లు మాత్రం ఓటేసేందుకు ససేమిరా రామంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
Similar News
News January 9, 2025
గంభీర్ మోసకారి: మనోజ్ తివారీ
IND హెడ్ కోచ్ గంభీర్ మోసపూరిత వ్యక్తి అని, అతడు చెప్పినవాటినే పాటించడని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ విమర్శించారు. IPLలో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, మోర్నే మోర్కెల్‌ను ఏరికోరి తన టీమ్‌లోకి తెచ్చుకున్నారని, వారేం చేశారని ప్రశ్నించారు. కెప్టెన్ రోహిత్‌తో గంభీర్‌కు సమన్వయం లేదన్నారు. గతంలో KKR విజయాల కోసం తాను, కల్లిస్, నరైన్ తదితరులు ఎంతో కృషి చేసినా గౌతీ క్రెడిట్ తీసుకున్నాడని దుయ్యబట్టారు.
News January 9, 2025
CTET ఫలితాలు విడుదల
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 31వ తేదీన కీని విడుదల చేసి, జనవరి 1 నుంచి 5వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థులు రోల్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <
News January 9, 2025
‘భూభారతి’కి గవర్నర్ గ్రీన్‌సిగ్నల్
TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘భూభారతి’ చట్టానికి గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలిపారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతికి రూపకల్పన చేసిన విషయం తెలిసిందే.