News May 19, 2024

నీటిలో ఎక్కి.. గాల్లో ఎగరొచ్చు

image

APలో సీ ప్లేన్ టూరిజానికి పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవాడ, కాకినాడ, రుషికొండ, లంబసింగి, కోనసీమ, విశాఖ ప్రాంతాల్లో సేవలు అందించనుంది. జలవనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ హౌస్ బోట్లతో సీ ప్లేన్ టెర్మినల్ నిర్మించనుంది. 9-10 మంది సామర్థ్యంతో కూడిన 2 ఫ్లోటింగ్ ప్లేన్లను రోజూ నడపనుంది. నీటిలో ఈ ప్లేన్లు ఎక్కి.. గాల్లో తిరుగుతూ AP పర్యాటక అందాలను ఆస్వాదించవచ్చు.

Similar News

News December 8, 2024

సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట.. ముగ్గురి అరెస్ట్!

image

‘పుష్ప-2’ ప్రీమియర్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద <<14793383>>తొక్కిసలాటలో మహిళ<<>> మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యానికి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. థియేటర్ యజమాని‌తోపాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్‌ని అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు అతని టీమ్‌పైనా కేసు నమోదైంది.

News December 8, 2024

నటి ధరించిన చెప్పులకు వేలంలో రూ.237 కోట్లు

image

ప్రముఖ US నటి జూడీ గెరాల్డ్ The Wizard of Oz చిత్రంలో ధరించిన రూబీ స్లిప్పర్స్ వేలంలో $28 మిలియన్ల(రూ.237 కోట్లు)కు అమ్ముడుపోయాయి. అన్ని రకాల ఫీజులతో కలిపి $32.5Mను ఓ వ్యక్తి చెల్లించాడు. అతని పేరు బయటికి వెల్లడికాలేదు. 2005లో మ్యూజియం నుంచి వీటిని దుండగులు దొంగిలించగా 2018లో FBI రికవరీ చేసింది. తాజాగా ఓ సంస్థ ఈ స్లిప్పర్స్‌ను వేలం వేయగా రికార్డు స్థాయి ధర దక్కింది.

News December 8, 2024

కాంగ్రెస్ హామీల అమలుపై నిలదీస్తాం: కేటీఆర్

image

TG: హామీల అమలు విషయంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై ప్రశ్నిస్తామని చెప్పారు. గిరిజన, దళిత రైతుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంపై ప్రభుత్వం చేస్తున్న దాడిని ఎండగడతామని పేర్కొన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ 420 హామీలను నిలదీస్తామని తెలిపారు.