News November 13, 2024

అక్కడ 14 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు!

image

దేశాలు, అక్కడి రూల్స్‌ను బట్టి వివాహం చేసుకునే వయస్సులో మార్పులుంటాయి. ఇండియాతో పాటు దాదాపు అన్ని దేశాల్లో వివాహం చేసుకోవాలంటే అబ్బాయికి 21, అమ్మాయికి 18 ఏళ్లు నిండాల్సిందే. అదే బొలీవియాలో WOMENకి 14, MENకి 16 ఏళ్లుంటే చాలు. చైనాలో Wకి 20 Mకి 22 ఏళ్లు. అఫ్గానిస్థాన్‌లో Wకి 16, Mకి 18గా ఉంది. యూరప్‌లోని అండోరాలో ఇద్దరికీ 16 ఏళ్లుండాలి. బహామాస్‌లో పేరెంట్స్ పర్మిషన్‌తో 15 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు.

Similar News

News November 19, 2025

ఏపీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు

image

ఏపీ మెడికల్& హెల్త్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 8 కాంట్రాక్ట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్(మేనేజర్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, పీజీడీసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.61,960 జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/msrb/

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.

News November 19, 2025

ఉమ్మడి మెదక్ జిల్లా వెదర్ రిపోర్ట్..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ 9.5, కోహిర్ 9.6, మెదక్ జిల్లా నర్లాపూర్ 9.5, దామరంచ 10.1, సిద్దిపేట జిల్లా బేగంపేట 8.6, పోతారెడ్డిపేట 9.6, కొండపాకలో 10.0 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత దృష్ట్యా వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.