News April 9, 2024

నెట్‌వర్క్‌ లేకున్నా కోల్పోయిన ఫోన్‌‌ లొకేషన్ గుర్తించొచ్చు

image

ఫోన్‌ను కోల్పోయినా, ఎవరైనా చోరీ చేసినా.. దాన్ని కనిపెట్టడం అంత సులువు కాదు. ఆండ్రాయిడ్‌లో ‘ఫైండ్ మై డివైజ్’ సౌకర్యం ఉన్నా, నెట్‌వర్క్ లేకపోతే పనిచేసేది కాదు. దీంతో గూగుల్ ఆ సౌకర్యాన్ని అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై ఇంటర్నెట్ లేకపోయినా సరే దాని సాయంతో ఫోన్‌ను కనిపెట్టొచ్చు. ఆండ్రాయిడ్ 9, ఆపై వెర్షన్లకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలోనే ఉన్న ఈ సౌకర్యం త్వరలోనే భారత్‌కూ రానుంది.

Similar News

News October 28, 2025

తుఫాను ప్రభావం.. భీకర గాలులు

image

AP: మొంథా తుఫాను దృష్ట్యా పలు జిల్లాల్లో భీకర గాలులు వీస్తున్నాయి. కోనసీమ, విశాఖ, కాకినాడ జిల్లాల్లో చెట్లు విరిగిపడ్డాయి. తీరం దాటే సమయంలో గంటకు 90-110 KM వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం *మచిలీపట్నం- 93 km/h *కాకినాడ- 82 km/h *విశాఖ- 68 km/h *రాజమండ్రి ఎయిర్‌పోర్ట్- 65 km/h *గంగవరం పోర్ట్- 58 km/h *చింతపల్లి- 55 km/h *బద్వేల్ (కడప)- 52 km/h వేగంతో గాలులు వీస్తున్నాయి.

News October 28, 2025

పూజ గదిలో ఈ విగ్రహాలు ఉండకూడదు: పండితులు

image

పూజ గదిలో శనిదేవుడు, రాహువు, కేతువుల ఫొటోలు/విగ్రహాలు పెట్టకూడదని పండితులు సూచిస్తున్నారు. వీటిని ఉంచడం వల్ల ఇంట్లో అశాంతి, ప్రతికూల శక్తి పెరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు. ‘ఉగ్ర రూపాలైన కాలభైరవ, మహంకాళి ఫొటోలను కూడా ఇంట్లో పెట్టడం శుభకరం కాదు. పూజ గదిలో తినకపోవడం, నిద్రించకపోవడం ఉత్తమం. తడి జుట్టుతో ఆ గదిలోకి వెళ్లడం మంచిది కాదు’ అంటున్నారు. ✍️ మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ.

News October 28, 2025

షమీ ఆన్ ఫైర్.. జాతీయ జట్టులో చోటు దక్కేనా?

image

రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఆడుతున్న షమీ జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా చెలరేగుతున్నారు. 2 మ్యాచ్‌ల్లో 68 ఓవర్లు వేసి 15 వికెట్లు పడగొట్టారు. తన ఫిట్‌‌నెస్, ఫైర్ తగ్గలేదని నిరూపించారు. NOV 14 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ జరగనున్న నేపథ్యంలో అగార్కర్, గంభీర్‌కు బిగ్ మెసేజ్ పంపారు. ఫిట్‌నెస్ లేదని WIతో టెస్టులకు, AUSతో వన్డే సిరీస్‌కు షమీని ఎంపిక చేయలేదు. ఇప్పుడేం చేస్తారో చూడాలి.