News April 9, 2024
నెట్‌వర్క్ లేకున్నా కోల్పోయిన ఫోన్ లొకేషన్ గుర్తించొచ్చు
ఫోన్‌ను కోల్పోయినా, ఎవరైనా చోరీ చేసినా.. దాన్ని కనిపెట్టడం అంత సులువు కాదు. ఆండ్రాయిడ్‌లో ‘ఫైండ్ మై డివైజ్’ సౌకర్యం ఉన్నా, నెట్‌వర్క్ లేకపోతే పనిచేసేది కాదు. దీంతో గూగుల్ ఆ సౌకర్యాన్ని అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై ఇంటర్నెట్ లేకపోయినా సరే దాని సాయంతో ఫోన్‌ను కనిపెట్టొచ్చు. ఆండ్రాయిడ్ 9, ఆపై వెర్షన్లకు ఇది వర్తిస్తుంది. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలోనే ఉన్న ఈ సౌకర్యం త్వరలోనే భారత్‌కూ రానుంది.
Similar News
News November 6, 2024
వాట్సాప్‌లో ఫొటో సెర్చ్ ఆప్షన్!
ఫొటోలను సెర్చ్ చేసేందుకు ‘search on web’ ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. దీని సాయంతో వేరే బ్రౌజర్‌లోకి వెళ్లకుండా యాప్‌లోనే ఫొటో గురించి సెర్చ్ చేయొచ్చు. ఆ ఫొటో ఎక్కడిది? ఎడిట్ చేశారా? అనే సమాచారం తెలుసుకోవచ్చు. ఫొటో పైన కనిపించే త్రీ డాట్స్‌పై క్లిక్ చేస్తే అందులో ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ ఈ ఆప్షన్ ఎనేబుల్ కానున్నట్లు వాబీటా ఇన్ఫో తెలిపింది.
News November 6, 2024
నా ప్రియ మిత్రుడు ట్రంప్‌కు శుభాకాంక్షలు: మోదీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి గెలుపొంది 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘చరిత్రాత్మక విజయం పొందిన నా ప్రియ మిత్రుడికి శుభాకాంక్షలు. పరస్పర సహకారంతో భారత్-యూఎస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేద్దాం. మన ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సైతం విషెస్ తెలిపారు.
News November 6, 2024
జో బైడెన్ స్టేట్‌లో ట్రంప్ ప్రభంజనం
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్టేట్ పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ విజయ దుందుభి మోగించారు. అక్కడ 19 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. 2016 తర్వాత మళ్లీ డెమోక్రాట్ల కంచుకోటను బద్దలుకొట్టారు. 1948 తర్వాత పెన్సిల్వేనియాను గెలవకుండా డెమోక్రాట్లు వైట్‌హౌస్‌ను గెలిచిన దాఖలాలు లేనేలేవు. ఈ వార్త రాసే సమయానికి ట్రంప్ 270 మ్యాజిక్ ఫిగర్‌కు 3 ఓట్ల దూరంలో ఉన్నారు. మీడియా ఆయన్ను ఇప్పటికే విజేతగా ప్రకటించేసింది.