News February 7, 2025

రీఛార్జ్ చేయకున్నా కాల్స్ మాట్లాడొచ్చు!

image

సింపుల్ ట్రిక్ పాటిస్తే ఫ్రీగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అందుకోసం మీ స్మార్ట్ ఫోన్‌లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉండాలి. మీ ఫోన్‌లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కనెక్షన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. దీనిని యాక్టివేట్ చేసుకునేందుకు Settings> Network> Internet Settings > Sim & Mobile network> Sim> Wifi Calling Toggle> activate చేయాలి. మొబైల్ నెట్‌వర్క్ సరిగా లేనప్పుడు ఆటోమేటిక్‌గా వైఫైతో కాల్స్ చేసుకోవచ్చు.

Similar News

News September 15, 2025

రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!

image

AP: అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశముందని APSDMA తెలిపింది. ఇవాళ అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు వానలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయంది.

News September 15, 2025

నేడు మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల

image

AP: ఇవాళ మెగా DSC తుది ఎంపిక జాబితా విడుదలకానుంది. అధికారిక వెబ్‌సైట్‌, జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాల్లోనూ రిజల్ట్ అందుబాటులో ఉంచనున్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకుగానూ జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. జులై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదలైంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తైంది. ఈనెల 19న అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు.

News September 15, 2025

నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

image

TG: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇవాళ ప్రారంభంకానుంది. ఈరోజు రిజిస్ట్రేషన్స్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. రేపు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20న సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం WWW.TGICET.NIC.INను సందర్శించండి.