News January 15, 2025
మీరు గేమ్ నుంచి తీసేయొచ్చు.. కానీ నా వర్క్‌ను ఆపలేరు: పృథ్వీ షా

జాతీయ జట్టుతోపాటు దేశవాళీ టీమ్‌లో తనకు చోటు దక్కకపోవడంపై పృథ్వీ షా పరోక్షంగా స్పందించారు. ‘మీరు నన్ను గేమ్ నుంచి తీసేయొచ్చు. కానీ నా వర్క్‌ను మాత్రం ఆపలేరు’ అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు అతను కొన్ని వారాలుగా మైదానం, జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఐపీఎల్లో కూడా పృథ్వీని ఏ జట్టూ కొనుగోలు చేయని విషయం తెలిసిందే.
Similar News
News December 30, 2025
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు

పలువురు IASలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GHMCపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇద్దరు Addl.కలెక్టర్లను నియమించింది. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు సృజన, మల్కాజిగిరి, LBనగర్, ఉప్పల్ జోన్లకు వినయ్ కుమార్‌ను కేటాయించింది. PR&RD డైరెక్టర్‌గా శ్రుతి ఓజా, NZB కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి, NLG కలెక్టర్‌గా చంద్రశేఖర్, నారాయణపేట్ Addl.కలెక్టర్‌గా ఉమాశంకర్‌ను నియమించింది.
News December 30, 2025
మీ పార్టీలు సరే.. ఇంట్లో వాళ్ల సంగతేంటి?

కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. న్యూఇయర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ధూంధాం పార్టీలుంటాయి. పబ్బులు, బార్లు, దోస్తులతో DEC 31st నైట్ ఎంజాయ్ చేస్తారు. పురుషులంతా వారి ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ కూడా చేసుకుని ఉంటారు. అయితే ఇంట్లో ఉండే వాళ్ల సంగతేంటి? అదే ఇంట్లో ఉన్న అమ్మ, అక్క, చెల్లి, భార్య.. వాళ్లకి కూడా కొత్త సంవత్సరమే కదా. వారి గురించి ఏమైనా ఆలోచించారా?
News December 30, 2025
హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ స్కోర్ ఎంతంటే?

శ్రీలంక ఉమెన్స్ టీమ్‌తో జరుగుతున్న 5వ టీ20లో భారత్ 175/7 రన్స్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 77 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 43 బంతుల్లో 68 రన్స్ చేసి ఆదుకున్నారు. చివర్లో అరుంధతీ రెడ్డి బౌండరీలతో చెలరేగారు. ఆమె 11 బంతుల్లో 27* రన్స్‌తో రాణించారు.


