News October 23, 2024
వైసీపీని విమర్శించే అర్హత మీకు లేదు.. రాదు: రోజా
హోంమంత్రి అనితపై మాజీ మంత్రి రోజా ట్విటర్‌లో మండిపడ్డారు. ‘మీ పార్టీ ఆఫీస్‌కి 10 కి.మీ దూరంలోని గుంటూరు ఆస్పత్రిలో TDP కార్యకర్త నవీన్ హత్యాయత్నం చేసిన దళిత యువతి సహానా కుటుంబాన్ని పరామర్శించలేవా? బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థి దస్తగిరమ్మ హత్య జరిగి 3 రోజులైంది. ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాలనిపించలేదా? మంత్రిగా బాధ్యతలు మరిచిన మీకు మమ్మల్ని విమర్శించే అర్హత లేదు. రాదు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 10, 2024
ప్రపంచంలో అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు ఇవే!
ప్రతి ఒక్కరూ ఫోన్, ఈమెయిల్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, సోషల్ మీడియా ఖాతాలకు పాస్‌వర్డ్‌లు ఉపయోగిస్తుంటారు. కానీ గుర్తుంచుకోవడం సులభమని కొందరు ఈజీ పాస్‌వర్డ్‌లు క్రియేట్ చేసుకుంటారు. అవి అత్యంత ప్రమాదకరమని ఓ స్టడీ తెలిపింది. 123456, 123456789, 12345, qwerty, password, 12345678, 111111, 123123, 1234567890, 1234567 పాస్ వర్డ్‌లు అత్యంత చెత్తవని వెల్లడించింది. ఇలాంటివి వాడకపోవడం మంచిదని పేర్కొంది.
News November 10, 2024
గ్రూప్-3 హాల్‌టికెట్లు విడుదల
TG: ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను TGPSC విడుదల చేసింది. 17న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2, 18న ఉ.10 నుంచి మ.12.30వరకు పేపర్-3 పరీక్ష ఉంటుంది. అర గంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 1,388 పోస్టులకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.
వెబ్‌సైట్: www.tspsc.gov.in/
News November 10, 2024
NDA vs INDIA: ఈ 2 నినాదాలపై ఎవరి వెర్షన్ వాళ్లది!
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బాటేంగే తో కాటేంగే, ఏక్ హై తో సేఫ్ హై నినాదాలు మార్మోగుతున్నాయి. NDA, INDIA వీటిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. బాటేంగే తో కాటేంగేకు విడిపోతే నష్టపోతామని అర్థం. ఏక్ హై తో సేఫ్ హై అంటే ఒక్కటిగా ఉంటే భద్రంగా ఉంటామని అర్థం. కులాల వారీగా విడిపోతే నష్టపోతామని, హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని బీజేపీ అంటోంది. హిందూ ముస్లిములను విడదీస్తే నష్టమన్నది కాంగ్రెస్ వాదన.