News November 7, 2024

ఓటమిని ఒప్పుకోవాల్సిందే.. సంతృప్తిగానే ఉన్నా: కమలా హారిస్

image

అమెరికా ఎన్నికల ఫలితాలను కచ్చితంగా ఒప్పుకోవాల్సిందేనని కమలా హారిస్ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తాను ఇప్పటివరకు సాధించినదాని పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. ‘చాలా మంది దేశం చీకటిలోకి వెళ్తుందని భావిస్తున్నారు. కానీ అలా జరగదని నేను నమ్ముతున్నా. అమెరికా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. ప్రజలందరికీ న్యాయం, గౌరవం, అవకాశాల కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని పేర్కొన్నారు.

Similar News

News November 7, 2024

శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ

image

రంజీ ట్రోఫీలో భాగంగా ఒడిశాతో మ్యాచులో ముంబై బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీ చేశారు. 201 బంతుల్లో 22 ఫోర్లు, 8 సిక్సులతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తన మూడో డబుల్ హండ్రెడ్‌ను నమోదు చేశారు. రంజీల్లో ఆయనకి ఇది రెండో డబుల్ సెంచరీ కాగా, మొదటిది 2015లో చేశారు. ఇటీవల మహారాష్ట్రతో మ్యాచులోనూ ఆయన సెంచరీతో రాణించారు. దీంతో అయ్యర్ త్వరలోనే జాతీయ జట్టులోకి తిరిగి రావొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

News November 7, 2024

డిగ్రీ అర్హత.. IDBIలో 1,000 ఉద్యోగాలు

image

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,000 పోస్టుల(కాంట్రాక్ట్) భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ ఉత్తీర్ణులై, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 01-10-2024 నాటికి 20-25 ఏళ్లు ఉండాలి. డిసెంబర్ 1న ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఎంపికైన వారికి రూ.29,000-31,000 వేతనం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://www.idbibank.in/

News November 7, 2024

ఏడాదిలో 4000 ATM మెషీన్‌లు క్లోజ్!

image

దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. చిరు వ్యాపారుల దగ్గర కూడా UPI పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. UPI, డిజిటల్ చెల్లింపుల కారణంగా భారతీయ బ్యాంకులు ATM మెషీన్‌లను మూసివేసే స్థితికి చేరుకున్నాయి. గత ఏడాదిలోనే 4000 ATM మెషీన్‌లు మూతపడినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ₹34.70 లక్షల కోట్ల నగదు చలామణి ఉంది. కాగా, దేశంలో లక్ష మందికి 15 ATMలు మాత్రమే ఉన్నాయి.