News January 23, 2025
ఈ క్రికెటర్తో మాట్లాడాలంటే కుర్చీ వేసుకోవాల్సిందే..

SA20 లీగ్ సందర్భంగా సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ను ఇంటర్వ్యూ చేసేందుకు కామెంటేటర్లు కుర్చీ వేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్కో హైట్ 6.9 అడుగులు. జట్టులో మిగతా సభ్యులంతా మార్కో ముందు చిన్నపిల్లల్లా కనిపిస్తారు. గతంలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా, మార్కో పక్కపక్కన ఉన్న ఫొటో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News December 27, 2025
డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు!

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో భారీగా కొకైన్, MDMA సీజ్ చేశారు. నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి రెగ్యులర్ కస్టమర్ల లిస్టులో అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అమన్ పరారైనట్లు సమాచారం.
News December 27, 2025
ఇక తక్కువ అద్దెకే రైతుకు సాగు పరికరాలు

AP: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతలకు తక్కువ ఖర్చుతో సాగుకు అవసరమయ్యే పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు CHC(కస్టమ్ హైరింగ్ సెంటర్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 300 CHCల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇక్కడ ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, డ్రోన్లు, మినీ ట్రక్కులు, భూసార పరీక్షలు చేసే కిట్స్, మినీ రైస్ మిల్లు, ఇతర పరికరాలను తక్కువ అద్దెకు రైతులకు అందిస్తారు.
News December 27, 2025
PCOS ఉన్నా పిల్లలు పుట్టాలంటే?

ప్రస్తుతకాలంలో చాలామంది PCOS వల్ల సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్నవారు బరువు తగ్గడం, ఇన్సులిన్ అదుపులో ఉంచుకోవడం, డీ విటమిన్ లోపం రాకుండా చూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ వైద్యులను కలిసి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. యోగా, ధ్యానం చేయడం, ఫాస్ట్ఫుడ్కు దూరంగా ఉండాలంటున్నారు.


