News December 5, 2024
మీకు నేషనల్ అవార్డు ఇవ్వాలి.. రష్మిక రియాక్షన్ ఇదే
‘పుష్ప-2’లో హీరోయిన్ రష్మిక అదరగొట్టారని సినిమా చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జాతర సీన్ తర్వాత ఆమె నటనకు జాతీయ అవార్డు ఇవ్వాలని ఓ అభిమాని ట్వీట్ చేశారు. దీనికి ‘నిజమా? యాయ్!’ అంటూ నేషనల్ క్రష్ రిప్లై ఇచ్చారు. కాగా ఈ మూవీలో రష్మిక డాన్స్ కూడా ఇరగదీశారని పలువురు పోస్టులు చేస్తున్నారు.
Similar News
News January 17, 2025
పదిహేనేళ్లలో రూ.5400 నుంచి రూ.4లక్షలు
డిగ్రీలున్నా ఉద్యోగాలు రాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు తక్కువ శాలరీ అని వచ్చినదాన్ని వద్దనుకుంటారు. అలా కష్టపడినవారికి ఎక్స్‌పీరియన్స్ తోడైతే విజయాన్ని ఎంజాయ్ చేయొచ్చనే విషయాన్ని గుర్తించరు. అలాంటి వారికి కళ్లు తెరిపించే ఓ ఉదాహరణ నెట్టింట వైరలవుతోంది. ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి 2008లో నెలకు రూ.5400 జీతం వచ్చే ఉద్యోగాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు ఏడాదికి రూ.50లక్షలు సంపాదిస్తున్నారు.
News January 17, 2025
రేపు మధ్యాహ్నం రోహిత్ శర్మ ప్రెస్ మీట్
భారత కెప్టెన్ రోహిత్ శర్మ రేపు మ.12.30 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ముంబై వాంఖడే స్టేడియం వద్ద చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్‌ను ప్రకటిస్తారు. అలాగే కొన్ని రోజులుగా డ్రెస్సింగ్ రూమ్‌లో వివాదాలంటూ వస్తున్న వార్తలపై స్పందించే అవకాశం ఉంది. కోచ్ గంభీర్ పాల్గొనే విషయంపై క్లారిటీ లేదు. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్.
News January 17, 2025
లక్షణాలు లేని హార్ట్ ఎటాక్‌ను గుర్తించిన యాపిల్ వాచ్!
ఓ వ్యక్తికి సైలెంట్ హార్ట్ ఎటాక్ రాగా.. దీనిని యాపిల్ గుర్తించిందని డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. ‘నా 60 ఏళ్ల స్నేహితుడు వ్యాయామం చేస్తుండగా మొబిట్జ్ టైప్ 2 అట్రియో-వెంట్రిక్యులర్ బ్లాక్ (ఒక రకమైన హార్ట్ బ్లాక్) లక్షణాలు గమనించారు. అతడిలో ఎలాంటి సిమ్‌టమ్స్ కనిపించలేదు. వెంటనే కార్డియాలజిస్ట్ చికిత్స చేయడంతో కోలుకున్నాడు. అతని యాపిల్ వాచ్‌లో హార్ట్ ఎటాక్ అంటూ అలర్ట్ రావడం చూశాం’ అని తెలిపారు.