News September 6, 2024

తాతగారిలా పేరు తెచ్చుకోవాలి.. మోక్షజ్ఞకు ఎన్టీఆర్ సలహా

image

సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞకు ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నటనలో తాతగారిలా పేరు తెచ్చుకోవాలి. ఆయన ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. హ్యాపీ బర్త్ డే మోక్షు’ అని తారక్ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ స్పందనతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, ‘తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

Similar News

News December 2, 2025

ఆ టీచర్లకు విద్యాశాఖ షాక్!

image

TG: సెలవు పెట్టకుండా విధులకు హాజరవ్వని టీచర్లపై కొరడా ఝుళిపించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. 30 రోజులు స్కూల్‌కు హాజరుకాకపోతే వారి ఇంటికే నోటీసులు పంపిస్తోంది. నోటీసులకు టీచర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా FRS వచ్చాక టీచర్ల హాజరు శాతం పెరిగినట్లు సమాచారం. గత రెండేళ్లలో నిబంధనలకు విరుద్ధంగా విధులకు హాజరుకాని 50 మంది టీచర్లను సర్వీస్ నుంచి విద్యాశాఖ తొలగించింది.

News December 2, 2025

శుభాలు కలిగించే హనుమద్వ్రతం.. మీరు చేస్తున్నారా?

image

మార్గశిర శుక్ల త్రయోదశి సందర్భంగా రేపు హనుమద్వ్రతం ఆచరిస్తారు. ఈరోజే హనుమ లంకలో ఉన్న సీతకు రాములోరి సందేశాన్ని అందించారని ప్రతీతి. అందుకు సంతోషించిన సీతాదేవి, హనుమను పూజిస్తే కోర్కెలు నెరవేరతాయని వరమిచ్చారు. ఈ వ్రతం ఆచరించి, 13 ముడుల తోరం ధరిస్తే మారుతీ మన భయాలను పాలద్రోలి, కార్యసిద్ధి, శత్రుజయాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. ☞ ఈ వ్రతం ఎలా చేయాలి? కథ, ఫలాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 2, 2025

రసంపీల్చే పురుగుల కట్టడికి జిగురు అట్టలు

image

పంటలకు హానిచేసే రసం పీల్చే పురుగుల కట్టడిలో జిగురు అట్టలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది. వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. పసుపు రంగు జిగురు అట్టలు తెల్లదోమ, పచ్చదోమ, వివిధ రకాల ఈగలను.. తెలుపు అట్టలు నల్ల తామర, ఎర్ర నల్లి, బ్లాక్‌ త్రిప్స్‌.. నీలిరంగు అట్టలు తామర పురుగులు, పేనుబంక, మిడతలను ఆకర్షిస్తాయి. ఈ అట్టలపై వాలగానే ఆ పురుగులు అతుక్కుని చనిపోతాయి.