News September 6, 2024
తాతగారిలా పేరు తెచ్చుకోవాలి.. మోక్షజ్ఞకు ఎన్టీఆర్ సలహా
సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞకు ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘నటనలో తాతగారిలా పేరు తెచ్చుకోవాలి. ఆయన ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. హ్యాపీ బర్త్ డే మోక్షు’ అని తారక్ స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ స్పందనతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా, ‘తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Similar News
News September 14, 2024
ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష.. ఇంటర్నెట్ నిలిపివేత!
అస్సాంలో గ్రేడ్-3 ప్రభుత్వ ఉద్యోగాలకు రేపు ఉ.10 గంటల నుంచి మ.1:30 గంటల వరకు నియామక పరీక్ష జరగనుంది. దీంతో పరీక్ష జరిగే సమయంలో అన్ని ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో ఇంటర్నెట్‌ను ప్రభుత్వం నిలిపివేయనుంది. 28 జిల్లాల్లో 2,305 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మోసానికి పాల్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలోనూ పరీక్షల సమయంలో ప్రభుత్వం ఇలానే ఇంటర్నెట్ నిలిపివేసింది.
News September 14, 2024
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పు వదిలేయాలా?
ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని కొందరి విశ్వాసం. అందుకే దీంతో దిష్టి తీస్తారు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఉప్పును వదిలేసి వెళితే మనలోని నెగటివ్ ఎనర్జీ పోతుందనీ నమ్ముతుంటారు. అయితే అలా చేయడం సరి కాదని పండితులు చెబుతున్నారు. ఉండటానికి నీడనిచ్చిన వారి ఇంట్లో ఉప్పు వదిలేసి వారికి హాని చేసే ఆలోచన మంచిది కాదంటున్నారు. కావాలంటే ఉప్పును నీళ్లలో వేయాలంటున్నారు. కరిగాక ఎక్కడైనా పోయవచ్చని చెబుతున్నారు.
News September 14, 2024
ముగిసిన వైసీపీ నేతల విచారణ
AP: మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల విచారణ ముగిసింది. జోగి రమేశ్, దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంను మంగళగిరి పోలీసులు విచారించారు. కాసేపటి క్రితం వారు పీఎస్ నుంచి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ పాస్‌పోర్టులను పోలీసులకు అప్పగించారు.