News March 8, 2025
IIT బాబా మార్కులు చూస్తే ఆశ్చర్యపోతారు!

మహాకుంభమేళాతో వెలుగులోకి వచ్చిన ఐఐటీ బాబా (అభయ్ సింగ్) మార్క్స్ షీట్ వైరల్ అవుతోంది. ఇతడికి 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 93%, 12వ తరగతిలో 92.4% మార్కులు వచ్చాయి. 2008లో ఐఐటీ జేఈఈలో ఆల్ ఇండియా 731వ ర్యాంక్ సాధించి, ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబేలో సీటు దక్కించుకున్నారు. 2008-12 వరకు బీటెక్ పూర్తిచేసి, కెనడాలో ఏడాదికి రూ.36 లక్షల జీతానికి జాబ్ చేశారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని బాబాగా మారారు.
Similar News
News January 19, 2026
స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టండిలా!

డెలివరీ అయిన తర్వాత చాలామంది మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. వీటిని ఎలా తొలగించుకోవాలంటే.. * ఆముదం నూనెను స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, 15నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత హీటింగ్ ప్యాడ్‌ను ఆ మార్క్స్‌పై 10 నిమిషాలు ఉంచాలి. ఇలా నెలరోజులు చెయ్యాలి. * కలబంద గుజ్జును స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి, మూడు గంటల పాటు వదిలేయాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో మూడుసార్లు చేయాలి.
News January 19, 2026
అమరావతికి స్వయం ప్రతిపత్తి దిశగా అడుగులు

AP: అమరావతికి స్వయంప్రతిపత్తి కల్పించేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. తొలిసారిగా ప్రపంచబ్యాంకు, ADB రూల్స్‌కు అనుగుణమైన రీతిలో పాలనా వ్యవహారాలు సాగేలా ఇవి ఉండనున్నాయి. ఆర్థిక అవసరాలు తీరేలా భూములు అమ్ముకొనే వీలు కల్పించనున్నారు. వనరులను మదింపుచేసి స్థిరమైన రాబడి కోసం పెట్టుబడులు వచ్చేలా ఫ్రేమ్‌వర్కును ఏర్పరుస్తారు. పాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటుచేస్తారు. ప్రస్తుత MNP చట్టాలనూ మారుస్తారు.
News January 19, 2026
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

బెంగళూరులోని <


