News July 19, 2024
‘మీ కరెంట్ బిల్లు రూ.4,02,31,842.331’.. షాకైన యూజర్
UPకి చెందిన బసంత్‌శర్మ రైల్వే ఉద్యోగం రీత్యా సిమ్లాలో ఉంటున్నారు. నొయిడాలోని తన ఇంటికి 3నెలల కరెంట్ బిల్లు రూ.4కోట్లు వచ్చింది. APR 9-JUL 18 మధ్య మొత్తం రూ.4,02,31,842.331 వచ్చిందని, JUL 24లోపు చెల్లించాలని మెసేజ్ రావడంతో బసంత్ షాకయ్యారు. ఆ ఇల్లు అద్దెకు ఇచ్చామని అధికారులకు చెప్పి విచారించారు. అది బిల్లింగ్‌లో పొరపాటు వల్ల వచ్చిందని ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్పాక బసంత్ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News October 4, 2024
13న అలయ్ బలయ్.. చంద్రబాబు, రేవంత్‌కు ఆహ్వానం: విజయలక్ష్మి
TG: ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘అలయ్ బలయ్’ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. CMలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.
News October 4, 2024
ప్రతీకార దాడికి DEADLY WEAPONS సిద్ధం చేస్తున్న ఇజ్రాయెల్!
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారదాడి ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఈసారి సైబర్ వార్‌ఫేర్‌కు దిగొచ్చని విశ్లేషకుల అంచనా. ది బెస్ట్ సైబర్ టీమ్ UNIT 8200 వారి సొంతం. కోవర్ట్ ఆపరేషన్స్ చేపట్టిన అనుభవం దీనికుంది. పేజర్ పేలుళ్ల మాదిరిగా ఇరాన్ మిలిటరీ, న్యూక్లియర్, ఆయిల్ ఫెసిలిటీస్‌పై సైబర్ అటాక్స్ చేయొచ్చని తెలిసింది. గతంలో నటాంజ్ న్యూక్లియర్ సైట్‌లో Stuxnet కంప్యూటర్ వైరస్ దాడితో ఇరాన్ విలవిల్లాడింది.
News October 4, 2024
ప్రతి రైతుకి యూనిక్ ఐడీ కార్డు.. వ్యవసాయ శాఖ కసరత్తు
APలోని రైతులందరికీ యూనిక్ ఐడీ కార్డులు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్రం తెచ్చిన ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ-పంట కోసం రైతుల ఆధార్‌ను వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానించారు. ఈ నేపథ్యంలో ID కార్డుల జారీ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 50 లక్షల మంది రైతులుండగా, 1.90 లక్షల మంది అటవీ భూముల రైతులనూ ఇందులోకి తెస్తున్నారు.