News December 30, 2024

మీరు క్షేమంగా ఉండటమే నాకిచ్చే గొప్ప బహుమతి: యశ్

image

JAN 8న తన పుట్టినరోజు సందర్భంగా హీరో యశ్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ‘ఇన్నాళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమ అసాధారణం. బర్త్‌డే వేడుకల విషయంలో ప్రేమ వ్యక్తీకరణను మార్చుకోవాలి. మీరు సురక్షితంగా, క్షేమంగా ఉండటమే నాకిచ్చే గొప్ప బహుమతి. మీరు 2025లో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. గత ఏడాది తన ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తూ ముగ్గురు ఫ్యాన్స్ చనిపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన రాసుకొచ్చారు.

Similar News

News January 14, 2026

‘అక్కడ మహిళల్ని..’ DMK MP వివాదాస్పద వ్యాఖ్యలు

image

DMK MP దయానిధి మారన్ ఉత్తరాది మహిళలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. TNలో మహిళలను చదువుకోమని ప్రోత్సహిస్తుంటే.. ఉత్తరాదిలో మాత్రం వారిని ‘వంటగదికే పరిమితం చేస్తూ, పిల్లల్ని కనమని’ చెబుతున్నారని విమర్శించారు. ద్రవిడ మోడల్ వల్లే TN అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ వ్యాఖ్యలపై BJP తీవ్రంగా మండిపడింది. మారన్ ఉత్తరాది వారిని అవమానిస్తున్నారని.. ఆయనకు కనీస జ్ఞానం లేదని ధ్వజమెత్తింది.

News January 14, 2026

త్వరలో రాష్ట్రంలో 10వేల పోస్టులకు నోటిఫికేషన్!

image

TG: రాష్ట్రంలో త్వరలో వైద్యారోగ్యశాఖలో 10వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.

News January 14, 2026

సింగపూర్ పాస్‌పోర్ట్ నం.1..! మన స్థానం ఎంత..?

image

మోస్ట్ పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ లిస్ట్-2026లో ఇండియా 80వ స్థానంలో(2025లో 85) నిలిచింది. మన PPతో వీసా లేకుండా 55 దేశాలకు వెళ్లొచ్చని హెన్లీ ఇండెక్స్ తెలిపింది. 192 కంట్రీస్ యాక్సెస్‌తో సింగపూర్ No.1.. 188 యాక్సెస్‌తో జపాన్, సౌత్ కొరియా No.2 ప్లేసెస్‌లో ఉన్నాయి. డెన్మార్క్, స్విట్జర్లాండ్, స్వీడన్, స్పెయిన్, లగ్జెంబర్గ్ 3లో నిలిచాయి. లిస్ట్‌లో USA 10, PAK 98ర్యాంకు పొందగా, AFG 101తో చివరన ఉంది.