News January 12, 2025

యువజన దినోత్సవ శుభాకాంక్షలు: తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలి. సోషల్ మీడియాను మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘యువతకు మార్గదర్శి, భారతీయ ఆధ్యాత్మిక మహర్షి, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Similar News

News September 4, 2025

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

image

కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దైంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 6న హైదరాబాద్‌లో జరిగే గణేశ్ శోభాయాత్రలో ఆయన పాల్గొనాల్సి ఉండగా, పర్యటన రద్దైంది.

News September 4, 2025

వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్దాం: మోదీ

image

దేశ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారుతాయని PM మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. ‘వోకల్ ఫర్ లోకల్ నినాదం మరింత ముందుకు తీసుకెళ్లాలి. దేశీయ ఉత్పత్తులు వాడుతున్నామని అందరూ గర్వపడాలి. గాంధీజీ నినాదం కూడా స్వదేశీ.. దాన్ని అందరం పాటించాలి. స్వదేశీ డే, స్వదేశీ వీక్‌ను పండుగగా నిర్వహించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

News September 4, 2025

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ కన్నుమూత

image

ప్రపంచ ప్రఖ్యాత, ఇటలీ లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్ అర్మానీ(91) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు ఫ్యాషన్ హౌస్ కంపెనీ తెలిపింది. కింగ్ జార్జియోగా పేరొందిన అర్మానీ మోడర్న్ ఇటాలియన్ స్టైల్‌తో పేరొందారు. ఆయన కంపెనీ ఏటా 2.3 బిలియన్ యూరోల ఆదాయం ఆర్జిస్తోంది. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచింది.