News January 12, 2025
యువజన దినోత్సవ శుభాకాంక్షలు: తెలుగు రాష్ట్రాల సీఎంలు

తెలుగు ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ పునర్నిర్మాణంలో, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలి. సోషల్ మీడియాను మీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘యువతకు మార్గదర్శి, భారతీయ ఆధ్యాత్మిక మహర్షి, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
Similar News
News February 16, 2025
IPL 2025: హైదరాబాద్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్?

హైదరాబాద్ గత ఏడాది ఐపీఎల్ రన్నరప్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచులు ఉప్పల్‌లోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది విజేతగా నిలిచిన KKR హోమ్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్2, ఫైనల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా SRH తొలి మ్యాచ్‌ను వచ్చే నెల 23న మధ్యాహ్నం ఆడనున్నట్లు సమాచారం. మొత్తం షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది.
News February 16, 2025
ఈ నెల 19 నుంచి యాదగిరి గుట్ట స్వర్ణగోపుర సంప్రోక్షణ

TG: యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఈ నెల 19న మొదలుకానున్నాయి. 23 వరకూ ఆ కార్యక్రమాలను నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 23న మహాకుంభాభిషేక ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. తాపడం పనులు ఈ నెల 19కి పూర్తికానున్నాయి. దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణగోపురంగా నిలవనున్న విమాన గోపురానికి 60కిలోలకు పైగా బంగారాన్ని వినియోగించడం విశేషం.
News February 16, 2025
కేంద్రం ఢిల్లీ తొక్కిసలాట మృతుల సంఖ్యను వెల్లడించాలి: కాంగ్రెస్

ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి. ఎంతమంది చనిపోయారో, క్షతగాత్రులెంతమంది ఉన్నారన్న వివరాల్ని కేంద్రం వెంటనే బయటపెట్టాలి. గల్లంతైన వారి వివరాల్ని ప్రకటించాలి. క్షతగాత్రులకు అత్యవసర వైద్య సహాయం అందించాలి’ అని డిమాండ్ చేశారు.