News March 7, 2025
దేశానికి యువత ఎక్స్‌ఫ్యాక్టర్: PM మోదీ

భారత్ నేడు ప్రపంచ వృద్ధిని నడిపిస్తోందని, యువత దేశానికి ఎక్స్‌ఫ్యాక్టర్ అని PM మోదీ అన్నారు. దేశ భద్రతపై NDA ఎంతో శ్రద్ధ చూపుతోందని ఢిల్లీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో వివరించారు. గ్రామాల్లో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతే, పట్టణ ప్రాంతాల్లో వ్యాపిస్తోందన్నారు. కొన్ని రాజకీయ పార్టీల మాటల్లో నక్సలిజం భావజాలం కన్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులు అదృశ్యమైనట్లు చెప్పారు.
Similar News
News March 28, 2025
అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పెద్దవాడు: అంబటి

AP: అబద్ధాలు చెప్పడంలో CM చంద్రబాబు అందరికంటే పెద్దవారని, నిజాలు చెప్పడంలో చిన్న వారని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది చంద్రబాబే. ప్రాజెక్టు నిధులను జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది నిజమని నిరూపిస్తే సాష్టాంగ నమస్కారం చేస్తా. కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును మేమే కడతామని CBN ఎందుకు ఒప్పందం చేసుకున్నారు?’ అని ప్రశ్నించారు.
News March 28, 2025
మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

TG: ఇవాళ్టి నుంచి మరో 5 రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరగొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల మధ్య, మరికొన్ని జిల్లాల్లో 36-40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
News March 28, 2025
జస్టిస్ వర్మపై FIR నమోదు చేయాలని డిమాండ్

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15855499>>యశ్వంత్ వర్మపై<<>> FIR నమోదు చేయాలని మాథ్యూ నెడుంపారా అనే లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ అనవసరమని మాథ్యూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల నేతృత్వంలో దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.