News December 16, 2024
భారత్ నం.1గా ఎదగాలంటే యువత కష్టపడాలి: నారాయణ మూర్తి

వారానికి 70hrs పని చేయాలన్న తన వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించుకున్నారు. భారత్ నం.1 దేశంగా ఎదగాలంటే యువత కష్టపడి పనిచేయాలని సూచించారు. ‘బెస్ట్ గ్లోబల్ కంపెనీలతో మనల్ని పోల్చుకుంటే, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉందని అర్థం అవుతోంది. మన లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి. మన దేశంలో 800M మంది ప్రజలు ఫ్రీ రేషన్ పొందుతున్నారు. వారంతా పేదరికంలో ఉన్నారు’ అని ఓ ఈవెంట్లో వ్యాఖ్యానించారు.
Similar News
News November 23, 2025
అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

AP: ద.అండమాన్ సముద్ర పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని IMD వెల్లడించింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఈనెల 30 నాటికి తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. ఉత్తర కోస్తాకు తుఫాను ముప్పు పొంచి ఉందని, NOV 28 నుంచి వర్షాలు పెరుగుతాయని తెలిపింది. అలాగే ఉత్తరాంధ్రలో భారీ-అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, KDP, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.
News November 23, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.
News November 23, 2025
దీపంలో వత్తి పూర్తిగా కాలిపోతే అశుభమా?

దీపంలో వత్తి పూర్తిగా కాలిపోవడం ఎలాంటి అశుభానికి సంకేతం కాదని పండితులు చెబుతున్నారు. వత్తి పూర్తిగా కాలిపోవడం, దీపం మధ్యలోనే ఆగిపోవడం అనేవి భౌతిక కారణాల వల్ల మాత్రమే జరుగుతుందని అంటున్నారు. ‘వీటికి దైవిక దోషాలు, ఎలాంటి అశుభ కారణాలు లేవు. దీపం ఎప్పుడూ సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. కాబట్టి ఈ పరిణామాల వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు ఉండవు. భయపడవలసిన అవసరం లేదు’ అని వివరిస్తున్నారు.


