News December 16, 2024

భారత్ నం.1గా ఎదగాలంటే యువత కష్టపడాలి: నారాయణ మూర్తి

image

వారానికి 70hrs పని చేయాలన్న తన వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించుకున్నారు. భారత్ నం.1 దేశంగా ఎదగాలంటే యువత కష్టపడి పనిచేయాలని సూచించారు. ‘బెస్ట్ గ్లోబల్ కంపెనీలతో మనల్ని పోల్చుకుంటే, ఇంకా మనం చేయాల్సింది చాలా ఉందని అర్థం అవుతోంది. మన లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలి. మన దేశంలో 800M మంది ప్రజలు ఫ్రీ రేషన్ పొందుతున్నారు. వారంతా పేదరికంలో ఉన్నారు’ అని ఓ ఈవెంట్‌లో వ్యాఖ్యానించారు.

Similar News

News January 23, 2025

12 ఏళ్ల తర్వాత రిలీజై.. రూ.100 కోట్లే లక్ష్యంగా!

image

తమిళ నటుడు విశాల్ హీరోగా సుందర్ తెరకెక్కించిన ‘మద గజ రాజా’ చిత్రం 12 ఏళ్ల తర్వాత విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలై ఇప్పటికే రూ.50 కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ & ఓవర్సీస్‌లో విడుదలై రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News January 23, 2025

పబ్లిసిటీ కోసమే బాబు దావోస్ పర్యటన: గుడివాడ అమర్నాథ్

image

AP: CM చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి ఒట్టి చేతులతో వస్తున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు మాత్రం రూ.వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాయని చెప్పారు. ‘దావోస్ పర్యటన పబ్లిసిటీ కోసం తప్పా ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. పెట్టుబడులు రాబట్టడంలో CM అట్టర్ ఫ్లాప్. ఈ పర్యటన కోసం సర్కార్ రూ.3 కోట్ల ప్రజాధనం వృథా చేసింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News January 23, 2025

రంజీలోనూ ఫ్లాప్ షో

image

రంజీ క్రికెట్ ఆడుతోన్న భారత బ్యాటర్లు అందులోనూ ఘోరంగా విఫలమయ్యారు. ఇవాళ రోహిత్ (3), జైస్వాల్ (4), గిల్ (4), రహానే (12), శ్రేయస్ అయ్యర్ (11), రుతురాజ్ గైక్వాడ్ (10), రజత్ పాటీదార్ (0), రిషభ్ పంత్ (1), పుజారా (6) అట్టర్ ఫ్లాప్ అయ్యారు.