News April 12, 2024

ఓటు హక్కుపై ఆసక్తి చూపని యువత

image

దేశ యువత ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ఓటు హక్కు కోసం యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే 18-19ఏళ్ల యువతలో 40% కంటే తక్కువ మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. ఓటు హక్కుపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా యువత తీరు దేశాన్ని కలవరపరిచేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Similar News

News February 8, 2026

‘సూపర్ హ్యూమన్స్’ని సృష్టించాలన్న ఎప్‌స్టీన్!

image

సెక్స్ ట్రాఫికర్ ఎప్‌స్టీన్ ఓ ‘సూపర్ హ్యూమన్ రేస్’ను సృష్టించాలని ప్రయత్నించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. “మరణానికి ముందు తన వింత కోరికను వెలిబుచ్చారు. తన DNAతో గొప్ప మేధస్సు కలిగిన పిల్లలను పుట్టించాలని కోరారు. గతంలోనూ న్యూమెక్సికోలోని తన పెద్ద పశువుల పాక(RANCH)లో మహిళలను గర్భవతులను చేయాలని శాస్త్రవేత్తలతో తరచూ చెప్పేవారు. కొందరు దానిని ‘BABY RANCH’ అని పిలిచేవారు” అని NYT పేర్కొంది.

News February 8, 2026

YS జగన్‌తో TVK విజయ్

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, తమిళ సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌లో కలిశారు. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

News February 8, 2026

ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: CM

image

TG: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ తర్వాత ఇస్తామని CM రేవంత్ చెల్పూర్‌ సభలో ప్రకటించారు. గోదావరి సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసే యోచన లేదన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం చేకూర్చే ఏ పనిని ప్రభుత్వం చేపట్టదని స్పష్టం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలను, దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.3వేలకోట్లయినా ఖర్చు చేస్తామన్నారు.