News August 7, 2024
ఎల్లుండి నంద్యాలకు వైఎస్ జగన్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 9న నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మహానంది మండలం సీతారామపురంలో హత్యకు గురైన పసుపులేటి సుబ్బరాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. కాగా ప్రత్యర్థుల దాడిలో గాయపడి విజయవాడలోని సన్‌రైజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు వైసీపీ కార్యకర్తలను జగన్ నిన్న పరామర్శించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 10, 2024
త్వరలోనే ఆపరేషన్ బుడమేరు.. కబ్జా చేస్తే శిక్ష: CM
గత ఐదేళ్లలో బుడమేరు వాగుపై అక్రమ కట్టడాలు కట్టారని, రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని.. ఒకానొక దశలో అది పూడుకుపోయే దశకు చేరిందని CM చంద్రబాబు తెలిపారు. చెత్తాచెదారం తీయకపోవడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంగా మారాయని, గట్లను పట్టించుకోకపోవడం వల్ల 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయని విమర్శించారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేసి, కబ్జా చేసినట్లు తేలితే శిక్షిస్తామని సీఎం హెచ్చరించారు.
News September 10, 2024
లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా? జాగ్రత్తలివే!
* ఆ యాప్ RBIలో రిజిస్టర్ అయిందా లేదా చెక్ చేయాలి. అవ్వకపోతే రుణం తీసుకోవద్దు.
* ప్లే స్టోర్‌లో ఎక్కువ డౌన్‌లోడ్స్ ఉన్నాయని లోన్ తీసుకోవద్దు. ఎందుకంటే లక్షకుపైగా డౌన్ లోడ్స్ ఉన్న చాలా ఇల్లీగల్ యాప్స్‌ను గూగుల్ ఇప్పటికే తొలగించింది.
* కస్టమర్ కేర్ సపోర్ట్ ఉందా? ఆయా నంబర్లు పనిచేస్తున్నాయా? స్పందన ఎలా ఉందనేది నిర్ధారించుకోవాలి.
* డబ్బు తిరిగి చెల్లించినా కూడా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
News September 10, 2024
తిన్న వెంటనే ఈ పనులు చేస్తే ముప్పు తప్పదు!
భోజనం చేశాక కొన్ని పనులు చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత:
స్నానం చేయొద్దు. శరీరంలో ఉష్ణోగ్రత మార్పు అరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ నీరు తాగొద్దు. దీని వలన ఒంట్లో టాక్సిన్లు పెరుగుతాయి. కాఫీ, టీ తాగొద్దు. వీటిలోని కొన్ని ఆమ్లాలు, ఆహారంలోని బలాన్ని తీసుకోనివ్వకుండా అడ్డుపడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోవద్దు. డయాబెటిస్, ఊబకాయం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు.