News June 24, 2024
సతీసమేతంగా బెంగళూరుకు వైఎస్ జగన్

AP: పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. గడచిన 3 రోజులుగా అక్కడే ఉన్న ఆయన, ప్రజాదర్బార్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, పార్టీ శ్రేణులతోనూ సమావేశమై వారికి ధైర్యం చెప్పారు. ఇక ఈరోజు మధ్యాహ్నంతో పులివెందుల పర్యటన ముగించుకున్న జగన్, సతీసమేతంగా అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు.
Similar News
News November 11, 2025
బిహార్ తుది దశ పోలింగ్‌కు సిద్ధం

బిహార్‌లో తుది దశ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 జిల్లాల్లోని 122 స్థానాలకు ఉ.7-సా.6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. బరిలో 1,302 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి దశలో రికార్డు స్థాయిలో 65.08శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అదే కంటిన్యూ అవుతుందా అని ఆసక్తి నెలకొంది. రెండు దశల్లో కలిపి ఈ నెల 14న అధికారులు ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు.
News November 11, 2025
వైద్యుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు

TG: నార్కట్‌పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంతో మహిళ మరణించిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారులు ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నెలలోగా డబ్బు చెల్లించకపోతే 9% వడ్డీతో చెల్లించాలని పేర్కొంది. ఆరెగూడెంకు చెందిన స్వాతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యం వికటించి మరణించింది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఫోరంను ఆశ్రయించారు.
News November 11, 2025
నవంబర్ 11: చరిత్రలో ఈరోజు

1888: స్వాతంత్ర్య సమర యోధుడు, భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (ఫొటోలో)
1917: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్.రంగా జననం
1970: రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు మరణం
1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకటరమణారెడ్డి మరణం
1994: భారత క్రికెటర్ సంజూ శాంసన్ జననం
2023: నటుడు చంద్రమోహన్ మరణం
* జాతీయ విద్యా దినోత్సవం


