News June 24, 2024
సతీసమేతంగా బెంగళూరుకు వైఎస్ జగన్
AP: పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. గడచిన 3 రోజులుగా అక్కడే ఉన్న ఆయన, ప్రజాదర్బార్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, పార్టీ శ్రేణులతోనూ సమావేశమై వారికి ధైర్యం చెప్పారు. ఇక ఈరోజు మధ్యాహ్నంతో పులివెందుల పర్యటన ముగించుకున్న జగన్, సతీసమేతంగా అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు.
Similar News
News November 9, 2024
వరుసగా 2 సెంచరీలు.. సంజూ రికార్డ్
సౌతాఫ్రికాతో తొలి T20లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అంతకుముందు అతడు HYDలో బంగ్లాతో T20లోనూ సెంచరీ చేశారు. దీంతో టీ20ల్లో భారత్ తరఫున వరుసగా 2 సెంచరీలు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచారు. తొలి 3 స్థానాల్లో మెకియాన్, రొసోవ్, సాల్ట్ ఉన్నారు. ఇక T20ల్లో IND తరఫున 2 సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్‌గానూ సంజూ రికార్డ్ నెలకొల్పారు.
News November 9, 2024
ట్రంప్‌పై హత్యకు ఇరాన్ వ్యక్తి ప్లాన్: అమెరికా
డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్‌కు చెందిన షకేరీ అనే వ్యక్తి కుట్ర చేశాడని అమెరికా న్యాయ శాఖ తాజాగా ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వం తరఫున అతడు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని పేర్కొంది. చిన్నప్పుడే అమెరికాకు వచ్చిన అతడిని 2008లో ఓ చోరీ కారణంగా ఇరాన్‌కు US పంపించేసిందని వివరించింది. ఈ ఏడాది అక్టోబరు 7న ట్రంప్‌ను హత్య చేసేందుకు కొంతమంది తనకు ప్లాన్ అందించారని అతడు తమకు చెప్పినట్లు స్పష్టం చేసింది.
News November 9, 2024
చట్టాలను ఉల్లంఘించిన స్విగ్గీ, జొమాటో: నివేదిక
స్విగ్గీ, జొమాటో సంస్థలు భారత్‌లో కాంపిటీషన్ చట్టాలను అతిక్రమించాయని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) తేల్చింది. తమ యాప్‌లలో కొన్ని హోటళ్లకు ప్రాధాన్యాన్ని ఇచ్చి, వాటికి లాభాన్ని చేకూర్చేలా రెండు కంపెనీలు వ్యవహరించాయని పేర్కొంది. దీనికోసం ఆయా హోటళ్లతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయని ఆరోపించింది. ఈ విషయంలో వాటిపై ఎటువంటి పెనాల్టీ విధించాలన్నది త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.