News June 21, 2024
రేపు పులివెందులకు వైఎస్ జగన్
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపటి నుంచి 5 రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆయన సొంత నియోజకవర్గానికి వస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ జిల్లాల YCP నేతలు, కార్యకర్తలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేలా దిశానిర్దేశం చేస్తారని సమాచారం.
Similar News
News September 17, 2024
వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత!
TG: NEP-2020లో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యావిధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం అమలు చేయాలని చూస్తోంది. తొలి ఐదేళ్లలో అంగన్వాడీ, ప్రీస్కూల్ మూడేళ్లతో పాటు 1,2 తరగతులుంటాయి. ఆ తర్వాతి మూడేళ్లు 3,4,5 క్లాసులు, ఆపైన 6,7,8 తరగతులు చదవాలి. చివరి నాలుగేళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9,10,11,12 తరగతుల్లో చేరాలి.
News September 17, 2024
JK ఎన్నికల పోటీలో 40% ఇండిపెండెంట్లు.. BJP వ్యూహమా!
జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 365 మంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగారు. 90 స్థానాల్లో మొత్తం 908 అభ్యర్థులు పోటీ చేస్తుండగా అందులో స్వతంత్రులే 40% ఉన్నారు. ప్రతి సెగ్మెంట్లో డివిజన్ల వారీగా కశ్మీర్లో ఐదుగురు, జమ్మూలో 2.93% పోటీలో ఉన్నారు. ఓట్లను చీల్చి గెలిచేందుకు BJP వీళ్లకు స్పాన్సర్ చేస్తోందని NC, PDP, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో 831 మంది పోటీచేయగా అందులో 274 మంది ఇండిపెండెంట్లు.
News September 17, 2024
నిస్వార్థ కర్మయోగికి పుట్టినరోజు శుభాకాంక్షలు: పవన్
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోన్న ప్రపంచ నాయకుడు, నిస్వార్థ కర్మయోగి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు అందించాలని వేంకటేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. మీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశం శాంతి, శ్రేయస్సుతో ప్రపంచ కేంద్రంగా ఉద్భవించింది’ అని పవన్ ట్వీట్ చేశారు.