News February 17, 2025
కేసీఆర్‌కు వైఎస్ జగన్ బర్త్‌డే విషెస్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైసీపీ అధినేత YS జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆరోగ్యం, సుఖసంతోషాలు ప్రసాదించాలని Xలో పోస్ట్ చేశారు. AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేశ్ KCRకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె MLCకవిత హ్యపిబర్త్‌డే డాడీ అని ట్వీట్ చేశారు, అనంతరం నందినగర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన పూజలో కవిత పాల్గొన్నారు.
Similar News
News March 18, 2025
ఓయూలో ఆంక్షలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

TG: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై ప్రభుత్వం నిషేధం విధించడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించింది ఓయూ విద్యార్థులే అని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం పౌరుల ప్రాథమిక హక్కు అని, పోలీసుల పహారాలో ఆ హక్కును అణచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం అంగీకరించదని హెచ్చరించారు.
News March 18, 2025
మొబైల్ రేడియేషన్ పెరిగితే.. ప్రమాదమే!

సెల్‌ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్. SAR ప్రకారం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6వాట్‌లకు మించొద్దు. *#07# డయల్ చేసి రేడియేషన్ చెక్ చేయొచ్చు. పక్షులు, చెట్లపై కూడా ఇది ప్రభావం చూపుతుంటుంది. రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులొస్తాయి. NCBI సర్వే ప్రకారం రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలొస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఎదురవ్వొచ్చు. SHARE IT
News March 18, 2025
డీలిమిటేషన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదు: KTR

TG: డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని కేటీఆర్ అన్నారు. ‘దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకి, దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి మాట్లాడింది మా పార్టీనే. డీలిమిటేషన్ విషయంలో కేంద్రంపై పోరాడుతాం. ఈనెల 22న చెన్నైలో జరిగే డీఎంకే సమావేశానికి హాజరై, మా పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తా’ అని తెలిపారు.