News November 26, 2024

ఈవీఎంలపై మరోసారి YS జగన్ వ్యాఖ్యలు

image

AP: EVMల పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నందున మెజార్టీ దేశాల్లో ఉన్నట్టుగా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకెళ్లకూడదని మాజీ CM జగన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం గొప్పగా కనిపించడమే కాదు విజయవంతంగా కూడా ఉండాలని ట్వీట్ చేశారు. ప్రాథమిక హక్కయిన వాక్‌స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఆందోళనకరమన్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్ దార్శనికతను కొనియాడారు.

Similar News

News December 4, 2024

GOOD NEWS: త్వరలో 1,00,204 ఉద్యోగాల భర్తీ

image

CAPF, అస్సాం రైఫిల్స్‌లో 1,00,204 ఉద్యోగ ఖాళీలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. CRPF-33,730, CISF-31,782, BSF-12,808, ITBP-9,861, SSB-8,646, అస్సాం రైఫిల్స్‌లో 3,377 చొప్పున పోస్టులున్నట్లు చెప్పారు. UPSC, SSC ద్వారా త్వరగా భర్తీ చేస్తామన్నారు. వైద్యపరీక్షల సమయం తగ్గించి, కానిస్టేబుల్ GD కోసం షార్ట్ లిస్టైన వారి కటాఫ్ మార్కులు తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News December 4, 2024

వారిని ఎస్సీల్లో చేర్చండి.. కేంద్రానికి ఎంపీ బైరెడ్డి శబరి లేఖ

image

AP: రాష్ట్రంలోని బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌కు MP బైరెడ్డి శబరి లేఖ రాశారు. సంచార జాతులుగా పేరొందిన వీరు జానపద కథలు చెప్తూ జీవిస్తారు. దీంతో ఒక గ్రామానికి పరిమితం కాకపోగా ఇప్పటికీ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు. వీరిని SCల్లో చేర్చడంలో కేంద్రం చొరవ చూపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News December 4, 2024

అస్సాంలో బీఫ్ తినడంపై బ్యాన్

image

అస్సాంలో బీఫ్ (గొడ్డు మాంసం)పై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్లు, బహిరంగ ప్రదేశాల్లో అన్ని మతాల వారు బీఫ్ తినడాన్ని బ్యాన్ చేస్తున్నామన్నారు. ఇది వరకు ఆలయాల దగ్గర ఈ నిషేధం విధించామని, ఇప్పుడా నిర్ణయం రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించాలని లేదంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని మంత్రి పిజుష్ ట్వీట్ చేశారు.