News August 18, 2024

పెళ్లి వేడుకలో వైఎస్ జగన్ దంపతులు

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. బెంగళూరు మారియట్ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. నూతన వధూవరులు పవిత్ర-డా.కౌశిక్‌ను జగన్, ఆయన సతీమణి భారతి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News December 7, 2025

50 ఏళ్ల నాటికి సరిపోయేలా ‘ఒంటిమిట్ట’ అభివృద్ధి

image

AP: పురాతన ఒంటిమిట్ట కోదండ రామాలయం అభివృద్ధిపై TTD ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోంది. మరో 50 ఏళ్లలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. వసతి, రవాణా, కల్యాణకట్ట, పుష్కరిణి, నక్షత్ర వనాలు, మ్యూజియమ్, ఉద్యానవనాలు, డిజిటల్ స్క్రీన్స్, కళామందిరం, 108Ft జాంబవంతుడి విగ్రహం, మాడ వీధుల అభివృద్ధి, CC కెమెరాలు వంటి వాటిపై EO సింఘాల్ అధికారులకు సూచించారు.

News December 7, 2025

RGSSHలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

image

ఢిల్లీలోని <>రాజీవ్‌గాంధీ<<>> సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ 33 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఎంబీబీఎస్‌, డీఎం, ఎంసీహెచ్, ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు రేపు ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. ఉదయం 10గం. నుంచి 12గం. వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు, రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://rgssh.delhi.gov.in/

News December 7, 2025

DEC9న ‘విజయ్ దివస్’ నిర్వహణ: KTR

image

TG: KCR ఆమరణ దీక్ష వల్ల 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షకు ఒక రూపం వచ్చిందని BRS నేత KTR పేర్కొన్నారు. ‘11 రోజుల దీక్ష ఫలించి DEC9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చింది. KCR త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఆరోజును విజయ దివస్‌గా సంబరాలు జరుపుకోవాలి’ అని పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్సులో పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలున్నందున గ్రామాల్లో కాకుండా నియోజకవర్గాల్లో జరపాలన్నారు. ఏ కార్యక్రమాలు చేపట్టాలో ఆయన వివరించారు.