News August 18, 2024

పెళ్లి వేడుకలో వైఎస్ జగన్ దంపతులు

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. బెంగళూరు మారియట్ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. నూతన వధూవరులు పవిత్ర-డా.కౌశిక్‌ను జగన్, ఆయన సతీమణి భారతి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 8, 2026

ఒకే ప్రాపర్టీని మళ్లీ మళ్లీ అమ్మి.. రూ.500 కోట్ల మోసం!

image

ఒకే ప్రాపర్టీని మళ్లీ మళ్లీ అమ్మి ఘరానా మోసం చేశారో కంపెనీ CEO. గురుగ్రామ్‌(హరియాణా)లో ప్రాజెక్టు చేపట్టానని, నెలవారీ ఆదాయం ఉంటుందని ఇన్వెస్టర్లను ‘32nd Avenue’ CEO ధ్రువ్ దత్ శర్మ నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి ₹కోట్లు తీసుకున్నారు. రిటర్న్స్ అడిగితే చేతులెత్తేశారు. బాధితుల ఫిర్యాదుతో ఫ్రాడ్ బయటపడింది. ధ్రువ్ ₹500 కోట్లకు పైగా మోసం చేసినట్లు పోలీసులు చెప్పారు. వెయ్యి మంది బాధితులున్నారని తెలిపారు.

News February 8, 2026

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌‌లో 21 పోస్టులు

image

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ (<>BARC)<<>>21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD, DM, DNB, MS, పీజీ డిప్లొమా, DMRIT, DNMT, DFIT, MSc(న్యూక్లియర్ మెడిసిన్‌) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://barc.gov.in.

News February 8, 2026

టమాటాలో కాయ పగుళ్లకు కారణం – నివారణ

image

టమాటా కాయ అభివృద్ధి చెందే దశలో కాయ తొడిమ వైపు, పూత చివరి వైపునకు నిలువు పగుళ్లు కనిపిస్తాయి. నీటి లభ్యతలో తేడాలు, అధిక ఉష్ణోగ్రత, వేడి వాతావరణం తర్వాత వానలు, బోరాన్ లోపం వల్ల ఈ పగుళ్లు కనిపిస్తాయి. దీని నివారణకు నేలలో తేమ సంరక్షణకు మల్చింగ్ చేపట్టాలి. నత్రజని ఎరువులను సిఫారసు మేరకే వాడాలి. పూత, పిందె దశల్లో లీటరు నీటికి డైసోడియం ఆక్టాబోరెట్ 1.25-1.5గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.