News June 12, 2024

YS జగన్ కీలక నిర్ణయం?

image

AP: ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోయిన YCP శ్రేణులను ఉత్తేజపరిచేందుకు మాజీ CM జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ క్యాడర్‌పై జరుగుతున్న దాడులతో బాధితులుగా మారిన వారికి అండగా నిలబడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. త్వరలోనే వారిని పరామర్శించి, భరోసా కల్పిస్తానని జగన్ ఇటీవల నేతలతో భేటీలో చెప్పినట్లు సమాచారం. దీంతో YSJ మరోసారి ఓదార్పు యాత్ర చేస్తారనే ప్రచారం నడుస్తోంది.

Similar News

News October 6, 2024

ఉజ్వల భవిష్యత్తుకు ప్రపంచ శాంతి అవసరం: మోదీ

image

మాన‌వాళి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌పంచ శాంతి అత్య‌వ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని మోదీ పున‌రుద్ఘాటించారు. దేశాల మ‌ధ్య ఐక్య‌త‌, భాగ‌స్వామ్యం ద్వారానే సామూహిక ప్ర‌య‌త్నాల విజ‌యం ఆధారప‌డి ఉంద‌న్నారు. ICJ-ICWకు రాసిన లేఖ‌లో ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు, న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, రచయితలు, సంపాదకులు, న్యాయ విద్యావేత్తల భాగ‌స్వామ్యం ప్రపంచ శాంతికి విధానాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మ‌ని పేర్కొన్నారు.

News October 6, 2024

WOW.. 65 అడుగుల దుర్గామాత విగ్రహం

image

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం మాదిరిగా ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పారు. కోఠిలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న విక్టరీ ప్లే గ్రౌండ్‌లో ఏకంగా 65 అడుగుల ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారు సింహ వాహనంపై మహాశక్తి అవతారంలో కనిపిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ లానే దుర్గామాత విగ్రహాన్ని కూడా ఉన్నచోటే తయారు చేయించారు.

News October 6, 2024

గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు వీరే

image

TGలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గద్వాల – N.శ్రీనివాసులు, MBNR – మల్లు నర్సింహారెడ్డి, వికారాబాద్ – శేరి రాజేశ్‌రెడ్డి, నారాయణపేట్ – వరాల విజయ్, కామారెడ్డి – మద్ది చంద్రకాంత్‌రెడ్డి, సంగారెడ్డి – G.అంజయ్య, వనపర్తి – G.గోవర్ధన్, RR – ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, కరీంనగర్ – సత్తు మల్లయ్య, నిర్మల్ – సయ్యద్ అర్జుమాండ్ అలీ, సిరిసిల్ల – నాగుల సత్యనారాయణ.