News June 12, 2024
YS జగన్ కీలక నిర్ణయం?

AP: ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోయిన YCP శ్రేణులను ఉత్తేజపరిచేందుకు మాజీ CM జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ క్యాడర్‌పై జరుగుతున్న దాడులతో బాధితులుగా మారిన వారికి అండగా నిలబడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. త్వరలోనే వారిని పరామర్శించి, భరోసా కల్పిస్తానని జగన్ ఇటీవల నేతలతో భేటీలో చెప్పినట్లు సమాచారం. దీంతో YSJ మరోసారి ఓదార్పు యాత్ర చేస్తారనే ప్రచారం నడుస్తోంది.
Similar News
News March 26, 2025
BREAKING: పంజాబ్ విజయం

గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో పంజాబ్ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో GT ప్లేయర్లు తడబడ్డారు. సాయిసుదర్శన్(74), బట్లర్(54), రూథర్‌ఫోర్డ్ (46) ఫర్వాలేదనిపించినా చివర్లో చేయాల్సిన రన్స్ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. దీంతో GT 20 ఓవర్లలో 232/5 స్కోరుకే పరిమితమైంది.
News March 26, 2025
రాత్రి చపాతి తింటున్నారా?

బరువు తగ్గడానికి చాలామంది రోజూ రాత్రి చపాతి తింటారు. దీని వల్ల లాభాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. రాత్రుళ్లు జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. చపాతిలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అరగడానికి టైం తీసుకుంటాయి. దీంతో ఇంకోసారి తినాలని అనిపించదు. ఫలితంగా జీర్ణవ్యవస్థపై భారం తగ్గుతుంది. అలాగే, గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల చక్కెర నిల్వలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగని ఎక్కువగా చపాతీలు తినడం సరికాదు.
News March 26, 2025
సుప్రీంకు చేరిన అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద తీర్పు

పోక్సో కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ‘వక్షోజాలు పట్టుకోవడం, పైజామా నాడా తెంచడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం కాదు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మహిళా సమాజంతో పాటు న్యాయ నిపుణులు మండిపడ్డారు. ఈ తీర్పుపై దాఖలైన పిటిషన్‌ను సోమవారం తిరస్కరించిన సుప్రీం.. ఇవాళ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. రేపు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.