News February 19, 2025

నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిర్చి యార్డ్‌కు చేరుకోనున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ అక్కడి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఫీజు పోరు నిరసనల్ని కోడ్ దృష్ట్యా వైసీపీ వాయిదా వేసుకుంది.

Similar News

News December 13, 2025

భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

image

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్‌ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.

News December 13, 2025

ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

image

<>ప్రసార భారతి<<>>, న్యూఢిల్లీ 16 కాస్ట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. CMA ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 17వరకు అప్లై చేసుకోవచ్చు. టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కాస్ట్ ట్రైనీలకు ప్రతి నెల స్టైపెండ్ చెల్లిస్తారు. మొదటి సంవత్సరం పాటు రూ.15,000, రెండో సంవత్సరం రూ.18,000, మూడో సంవత్సరం రూ.20,000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in

News December 13, 2025

₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

image

TG: కుల, మతాలకు అతీతంగా విద్యార్థులందరికీ ఉత్తమ విద్య అందించేలా యంగ్ ఇండియా స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ‘CM విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు. ₹21వేల కోట్లతో ఈ స్కూళ్ల భవనాలు నిర్మిస్తున్నాం. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ₹642 కోట్లతో స్కూళ్లలో సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వివరించారు. నైపుణ్యాల పెంపునకు ITIలలో ATCలను నెలకొల్పుతున్నట్లు వివరించారు.