News February 19, 2025
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిర్చి యార్డ్‌కు చేరుకోనున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ అక్కడి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఫీజు పోరు నిరసనల్ని కోడ్ దృష్ట్యా వైసీపీ వాయిదా వేసుకుంది.
Similar News
News April 17, 2026
దొరికిపోయిన ‘జననాయగన్’ లీక్ దొంగలు

విజయ్ సినిమా ‘జననాయగన్’ లీక్ కేసును పోలీసులు ఛేదించారు. ఓ ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ సినిమా స్టూడియో సెక్యూరిటీని దాటుకొని మరీ డిజిటల్ రీల్స్‌ను దొంగిలించినట్లు గుర్తించారు. వేరే ప్రాజెక్టులో పని చేస్తూ ఎడిటింగ్ రూమ్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నిందితుడు.. డేటాను దొంగిలించి మరో ఇద్దరికి చేరవేశాడు. దీంతో సినిమా ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమైంది. ముగ్గురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 17, 2026
‘గరుడ’ విష్ణుమూర్తి వాహనం ఎలా అయ్యాడు?

వినత కుమారుడైన గరుడుడు తన తల్లిని బానిసత్వం నుంచి విడిపించడానికి కద్రువ కోరిక మేరకు దేవలోకం నుంచి అమృతాన్ని తెస్తాడు. అపారమైన శక్తి ఉన్నా, అమృతంపై ఆశ పడడు. తల్లి కోసం నిస్వార్థంగా పనిచేసిన ఆయన ధైర్యం మహావిష్ణువును మెప్పించాయి. దీంతో విష్ణుమూర్తి, అతనికి చిరంజీవిత్వం ప్రసాదించి తన వాహనంగా, ధ్వజంగా స్వీకరించారు. గరుడుడు సముద్రాలను దాటగలడు. వేగవంతుడు. విష్ణు సాయం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.
News April 17, 2026
IPL: బోణీ కొట్టి బోల్తా పడింది!

ఐదుసార్లు ఛాంపియన్ MI ఈ IPLలో దారుణంగా ఆడుతోంది. తొలి మ్యాచులో KKRపై గెలిచి బోణీ కొట్టిన ఆ జట్టు తర్వాత 4 మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దీంతో -1.076 నెట్‌రన్‌తో పాయింట్ల టేబుల్‌లో చివరి నుంచి రెండో ప్లేసులో నిలిచింది. జట్టులో సీనియర్లు రోహిత్, సూర్య, హార్దిక్, తిలక్ గొప్పగా రాణించడం లేదు. పేసర్లలో బుమ్రా, చాహర్ తేలిపోతున్నారు. పాండ్య కెప్టెన్సీపైనా అటు ప్లేయర్లు, ఇటు ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.


