News September 19, 2024
చంద్రబాబు, లోకేశ్‌కు సవాల్ విసిరిన వైసీపీ
AP: శ్రీవారి ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై YCP ఘాటుగా స్పందించింది. ఈ విషయంలో తన కుటుంబం దైవ ప్రమాణానికి సిద్ధమని, CBN సిద్ధమా? అని TTD మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి చేసిన <<14135822>>పోస్టును<<>> రీట్వీట్ చేసింది. ‘చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా? మేం సవాల్ చేస్తున్నాం’ అని రాసుకొచ్చింది. CM ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
Similar News
News October 7, 2024
కరాచీ ఉగ్రదాడిలో ఇద్దరు చైనీయులు మృతి
పాకిస్థాన్ కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన <<14292979>>ఉగ్రదాడిలో<<>> ఇద్దరు చైనీయులు మరణించారు. ఈమేరకు పాక్‌లోని చైనా ఎంబసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తొలుత దీన్ని ఆత్మాహుతి దాడిగా భావించినా, వాహనంలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్లు తర్వాత అధికారులు గుర్తించారు. కాగా విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇప్పటికే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.
News October 7, 2024
40వేల టార్గెట్స్, 4700 టన్నెల్స్‌పై బాంబులేసిన ఇజ్రాయెల్
యుద్ధం మొదలయ్యాక 40వేల హమాస్ టార్గెట్స్, 4700 టన్నెల్స్, 1000 రాకెట్ లాంచర్ సైట్లను బాంబులతో నాశనం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 2023 OCT 7 నుంచి 726 మంది తమ సైనికులు మరణించారని తెలిపింది. అదేరోజు 380, మిలిటరీ ఆపరేషన్స్ మొదలయ్యాక మిగిలినవాళ్లు చనిపోయారని పేర్కొంది. 4576 మంది గాయపడ్డారని చెప్పింది. 3 లక్షల రిజర్వు సైనికుల్ని నమోదు చేసుకున్నామని, అందులో 82% మెన్, 18% విమెన్ ఉన్నారని తెలిపింది.
News October 7, 2024
ఇవాళ రా.9 నుంచి ఘాట్‌రోడ్డులో బైక్, ట్యాక్సీలపై నిషేధం
AP: తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శ్రీవారికి కీలకమైన గరుడవాహన సేవ జరగనుంది. ఈ వేడుకను వీక్షించేందుకు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వాహన రద్దీని నియంత్రించడానికి ఇవాళ రా.9 నుంచి ఎల్లుండి ఉ.6 గంటల వరకు బైకులు, ట్యాక్సీలకు ఘాట్ రోడ్డులో అనుమతిని నిరాకరించారు. రేపు సా.6.30 నుంచి రా.11 గంటల వరకు మలయప్పస్వామి గరుడ వాహనంపై విహరించనున్నారు.