News February 4, 2025
రూ.5,447 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం: టీడీపీ

AP: మార్చి 12న వైసీపీ తలపెట్టిన ‘ఫీజు పోరు’పై టీడీపీ Xలో ఫైరయ్యింది. గత ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్, చిక్కీలు, కోడిగుడ్లు, వసతి దీవెన కింద ₹5,447 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించింది. YS జగన్ విద్యార్థులు, వారి పేరెంట్స్‌ను మానసిక క్షోభకు గురి చేస్తే లోకేశ్ ₹800 కోట్లు విడుదల చేసి మనోధైర్యాన్ని నింపారని పేర్కొంది. YCP నేతలు ‘ఫీజు పోరు’ కలెక్టరేట్ల ముందు కాకుండా జగన్ యలహంక ప్యాలెస్ ముందు చేయాలంది.
Similar News
News February 14, 2025
మున్షీ స్థానంలో మీనాక్షి

TG: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె రాహుల్ గాంధీ టీమ్‌లో కీలకంగా ఉన్నారు. కొంతకాలంగా మున్షీ తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.
News February 14, 2025
వచ్చేవారం భారత్-బంగ్లా ‘సరిహద్దు’ చర్చలు

సరిహద్దు సమస్యలపై భారత్-బంగ్లాదేశ్ ఈ నెల 17-20 తేదీల మధ్యలో చర్చలు నిర్వహించనున్నాయి. సరిహద్దుల్లో కంచె నిర్మాణం, BSF జవాన్లపై బంగ్లా దుండగుల దాడి వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలోని BSF ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలాక ఇరు దేశాల మధ్య ఇదే తొలి అగ్రస్థాయి సమావేశం.
News February 14, 2025
రూ.7.5 కోట్ల జీతం.. అయినా జీవితం శూన్యం: టెకీ ఆవేదన

వారానికి 70, 90hr పనిచేయాలంటూ కంపెనీల దిగ్గజాలు ఉచిత సలహాలిస్తున్న వేళ ఓ టెకీ ఆవేదన ఆలోచింపజేస్తోంది. తాను రోజూ 14hr పనిచేస్తూ ₹7.5Cr జీతం తీసుకుంటున్నా మ్యారేజ్ లైఫ్ విషాదాంతమైందన్నారు. ‘కూతురు పుట్టినప్పుడు నేను మీటింగ్‌లో ఉన్నా. డిప్రెషన్‌లో ఉన్న భార్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేకపోయా. ఇప్పుడు ఆమె డివోర్స్ కోరుతోంది. కెరీర్‌లో ఎంతో సాధించినా జీవితం శూన్యంగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.